అక్షరాలోచన

ఊరు పాతబడ్డది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరు చల్లగుండ
గప్పుడు ఊల్లందరు
కడుపునిండుగ కనుకున్నరు
చీమిడిముక్కు పోరగాండ్లతోటి
ఇండ్లన్నీ గలగలగుండేవి
ఇంటెన్క కొట్టముల
ముందటి గాడిఖాన్ల
గొడ్డుగోద పూలశెట్లు
తోకలూపుతూ మెడల్దింపుతూ
అత్తరు వాసన రివ్వుతుండేవి
పొద్దుగూకంగనే లైటు బుగ్గకు
గాసునూనె బుడ్డి మశిపట్టి
ఇల్లంతా మసకమస్గ గున్నా
ఏందో మరి
అందరు ఉషారుగుండెటోల్లు
కానుగబడిల
పంతుల పద్యం జెప్పినా ఎక్కాలు జెప్పినా
జప్పున సమజయితుండె
దుమ్ముగొట్కపోయిన
అంగీలాగు గలీజుగున్నా
మస్తుగ నిద్ర బట్టేది
రేకులు, గూనపెంకల కొంపలైనా
అర్షంబడినా ఎండగొట్టినా
కోతులుదుంకేనా - ఎలుకలురికినా
గప్పుడు గదే గమ్మతు
ముందొచ్చిన సెవులకంటే
ఎన్కకచ్చిన కొమ్ములు కొశ్చగనుకుంటా...
మాట నేర్పిన అవ్వకు
బుద్దినేర్పిన బాపుకు
మీకేం తెలదంటూ ఒక్కోలాక్కోల్లూ
ఉద్యోగం - సద్యోగం, పెండ్లాం పిల్లలంటూ
ఏమ్మాయనో - ఏమారిండ్రు
పట్నం బాట పట్టిండ్రు
గిప్పుడు ఏ ఇండ్లజూసినా
ముసలోల్లు ముతుకోల్లే
ఊరిని నమ్ముకున్న
గొడ్డుగోద శెట్టు పిట్ట తప్ప
మనుషులు గాన్రాక
ఆడకట్లన్నీ...
పొద్దుగాల్లనే గుయ్‌మంటున్నయి
అయినోళ్ల పాణంబోతెగాని
యాదికి రాలేదు
‘ఊరు పాతపడ్డదని’

దేశమంటే ఇల్లు

-శారదా అశోకవర్థన్
9866021570

దేశం అంటే మనం నివసించే
మన ఇల్లు
ఇల్లు బాగుంటేనే ఇంట్లో అందరూ
బాగుంటారు లేదా
ఇంట్లో అందరూ బాగుంటేనే
ఇల్లు బాగుంటుంది
రుసరుసలు బుసబుసలు
చీట్లాటలూ పోట్లాటలూ
అశాంతి అసహనంతో ఇల్లుంటే
ఇంట్లో వాళ్లే ఇంట్లో వాళ్లనేడిపిస్తూ
పొరుగింటి వాళ్లతో చెయ్యి కలిపితే
అది ప్రత్యక్ష నరకం.
అన్నదమ్ముల్లా హాయిగా అమ్మ దగ్గర
ఉండవలసిన వాళ్లు
కొట్లాటలతో కొట్టుకు పొడుచుకు ఛస్తుంటే
అమ్మ కట్టిన భవనం
ముక్కలైపోదూ?
అమ్మ హృదయం దుఃఖంతో కుమిలిపోదూ?
అన్నం పెట్టిన అమ్మ చేతుల మీద వాతలు పెడితే
క్షోభించే అమ్మ శోకంతో కుమిలిపోతుంది
ఇంట్లో అభద్రత తాండవం చేస్తుంది
ఒకరినొకరు తిట్టుకోవడం చంపుకోవడం మానండి
పక్కింటి వాళ్ల కాళ్లు పట్టుకోవడానకి సిద్ధపడకండి
అయిన వాళ్ళ చేతులు కలపండి
మనసులో కేన్సర్‌లా పెరుగుతూన్న ద్వేషాన్ని చంపండి
అమ్మని ఆదుకోండి!
ఆమె ఆనందమే మనకి
ఆహ్లాదం ఆరోగ్యం అని మరువకండి.

దాబా హోటల్
-ఐతా చంద్రయ్య
9391205299

ప్రయాణీకుల ఆకలి కేకలు పీల్చుకుని
ఆత్మీయత పౌడరద్దుకుని పలుకరిస్తుంది
ఆధునిక సరదా పరదా విహరణ కాంక్షుల
కోర్కెల గుర్రాలకు స్వాగత - సత్కారాలందించి
కళ్లాలు వదులుచేస్తుంది.
వాహనాలను అక్కున చేర్చుకుని
విశ్రాంతి జవజీవాలు రంగరిస్తుంది.
రాత్రికి పగలు ఫోకస్ వెదజల్లుతుంది
సకల సదుపాయాలను పరుస్తుంది
పార్టి-రిపార్టిల వేదికయై
మాటల రిపోర్టులను జీర్ణించుకుంటుంది
మెయిన్ రోడ్ మొండానికి తలకాయలాగుంటుంది
సెల్‌ఫోన్ సంభాషణలను
గుండెగూటిలో నిక్షిప్తం చేసుకుంటుంది
వినియోగదారులకు వినోదాలు పంచుతుంది
అధికారుల హల్‌చల్‌కు
రాజీ బాజాలు మోగిస్తుంది
సూటు-బూటు, పంచ-రుమాలు
వేషమేదైనా దోషం లేదంటుంది
కులమతాల తేడాల మెడలు వంచి
అందరి ఆరాటాలను గుర్తిస్తుంది
చాటు-మాటు సరసాలు, సరదాలకు
సిగ్గుపరదా చాటు చేసుకుంటుంది
సౌధము రేకులదైనా
సాధనలకు కొదువలేదు
పరిశుభ్ర ప్రాంగణం గుండెల మీద
టేబుల్ కుర్చీ ఆసనాలలంకరిస్తుంది
దాబా హోటలంటే-
నిత్య కల్యాణం - పచ్చతోరణం
*

-మడిపల్లి హరిహరనాథ్ 9603577655