అక్షరాలోచన

తొలిమెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ భారత
నవ తరమా...
మేలుకో ఏలుకో
ఇదేరా!
ఎన్నికల సమరం
మీకిదే
సమయం
దేశానికి శక్తి మీరు
భారత జాతికి
వనె్న మీరు
ప్రజాస్వామ్య భారతంలో
మీ స్థానం
ఎక్కడుంది?
నవ భారత
యువతరమా..
నా దేశ
సౌభాగ్యమా
మీ గమ్యం ఎటువైపు
మీ తీర్పు
ఒక మార్పు
మీ తీర్పు కావాలి
ఓ మార్పు.. రావాలి
ఆ.. మార్పు
అభివృద్ధికి
చిరునామా కావాలి...
అందుకే..
మనం మారుదాం
జనం మారుతారు
జనం
మారితే
జగం మారుతుంది
ఆ.. మార్పుకోరే!
భారత ఎన్నికల సంఘం
మీకొక
ఆయుధాన్నిచ్చింది
ఆ వజ్రాయుధమే
ప్రతి సామాన్యుడి
హక్కు
అదే అదే
మన ఓటుహక్కు
మీ
ఓటు హక్కే
మన
దేశాభివృద్ధికి
తొలి మెట్టు.

అరచేతిలో ప్రపంచం

-అయాచితం నటేశ్వరశర్మ
9440468557
ఉత్తరాలను మింగిన సెల్‌ఫోన్
చిత్తాన్ని కూడా కబళిస్తోంది
దూరాలు దగ్గరయ్యాయి కానీ
దగ్గరివాళ్లు దూరమయ్యారు
కలుసుకునే సమయం మాయమైంది
పలుకరింపులు అదృశ్యమైపోయాయి
చెవికే అతుక్కుపోతున్న సెల్‌ఫోన్
ఎన్నటికీ చెవిని వీడనంటోంది.
ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నా
ప్రయాణంలో సెల్‌ఫోన్‌కు
ప్రత్యామ్నాయమే లేదు
మాటలకు తీరిక లేదు
పాటలకు తీరిక లేదు.
కోటి పనులూ అరచేతిలోనే.
మీటుతున్న సెల్ నంబర్లతోనే!
ప్రపంచం అంతా సెల్‌ఫోన్‌లోనే
సంకుచితమై పోయింది!

ఈనాటి అవసరం
-మాదిరాజు రంగారావు
040-23398899
ఒక కవి గరుత్మంతుని వారసుడు కావచ్చు
ఒక కవి ఆదిశేషుని వారసుడు అవచ్చు
ఒక కవి అగ్నికీల అయితే
ఒక కవి జలదమూర్తి కావచ్చు

ఎవరి తీరు వారిది, ఎవరి బాట వారిది
ఎందరు సృజనకారులో, అన్ని గుణరూపాలు
ఎవరి పాత్ర వారిది, ఎవరి గమ్యం వారిది
ఒక సందర్భం! ఘర్షణలో నిలబెడుతుంది

మనిషిలో మానవతా మందారం సులభం కాదు
విశ్వబంధువు అయితేనే! హృదిలో సాధ్యం
స్వేచ్ఛకు సీమలు, భూమి ఆకాశం దిశలే
అయితే! బ్రతుకులో పట్టు తప్పడం జరుగుతుంది
సృజన గుణ బీజం! ఈనాడు
మంటల చివురులు చూపుతూంది

ఒక క్షణం విష బిందువు చిమ్మి
మనసు దెబ్బతిని, వికలమై సమాజం
కథ మలుపులు తిరుగుతుంది విషమంగా
ఆలోచనలో వైతరణి కదలుతుంది

మహావ్యాధికి ఇచ్చే మందు
మోతాదు మించితే అపాయం
సైడ్ ఎఫెక్ట్స్‌తో ప్రమాదం
మనోభయం నుండి బాధ కఠోరం
ఇది తీరే ఉపాయం ఒకటే
అది మానవతా సుధారసం

పాల సంద్రాన్ని చిలకనక్కరలేదు
హృదయ పద్మం విప్పారితే
తళతళలాడుతుంది మధు బిందువు

స్వచ్ఛమైన సృజన మతికి
మాటా మనసూ చేతా మూడూ ఒకటే
మానవతా మనోజ్ఞ సిద్ధి ఒక తపః ఫలం
చేతిలో వచ్చి చేరే అద్భుత దీపం కాదు

ఏ దేశమయినా ఏ భాష అయినా
ఏ వర్ణమయినా ఏ స్థాయి అయినా
అందంతో గంధంతో ప్రయోజన రూపంతో
వాస్తవానుభవాల రచనా ప్రపంచం

కఠోరమైన విస్ఫోటక గుణ వర్తనం
మానవ సంస్కృతిలో వొదగలేని వాస్తవం

శాఖోపశాఖలుగా పలు రకాల చెట్ల వనం
వివిధ భావ ప్రసారాల మానవ సమాజం
చెదరికుండా కాపాడే బాధ్యత?
మానస పరివర్తన దిశలో ప్రతి వ్యక్తిదీ
దార్శనిక విశేషంతో రచయితదీ
రాజనీతి నిపుణతతో నేతలదీ
ఇది మరవరాని వాస్తవం
ఈనాటి ప్రజాస్వామ్యం అవసరం.
*

-కె.శ్యామ్‌కుమార్ 9000011435