అక్షరాలోచన

స్వేచ్ఛ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు గోడల మధ్య
నీ అస్తిత్వం
ఎగరలేని చిలుకై
బంధించబడుతుంది

పసితనం
పరదాల మాటున
మగ్గిపోతున్నప్పుడు
విడుదల ఎప్పుడు?
నిరంతర ప్రశ్న
తొలుస్తూనే ఉంది.

కలల్లో కనిపించే
రాకుమారుడు
చంపబడి
నీ ముందు వికృత రూపమై
నిలిచినప్పుడు
బతుకు నిన్ను లొంగదీసుకుంటుంది
శరీరం
పిల్లలని కనే యంత్రంగా
మారిపోయినప్పుడు
అనుభూతులు
కొవ్వొత్తులై కరిగిపోతాయి

దిక్కుతోచక తెలియని దారిలో
నీకు నువ్వు అపరిచిత వ్యక్తివే

నీ ఉనికి సంద్రాయపు సంకెళ్లలో
బందీ అయినప్పుడు
రెక్కలు తెగిన పక్షిలా
గిలగిల కొట్టుకుంటూ
ఎగర ప్రయత్నిస్తూనే ఉంటావు

స్వేచ్ఛ కోసం మరో ప్రపంచంలో
పయనించాలని పోరాడుతూనే ఉంటావు
*

-పుష్యమీసాగర్