అక్షరాలోచన

సదా బాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుటాకు శరీరాన్ని
చూచి చూచి, తలచి తలచి
వలచి వలచి మరులుగొని
మలచుకున్న జాజులు, విరజాజులు,
మల్లెలు, వర్ధనాలు
వస్త్రాలై ఆయన కాహార్యమైనాయి

బాలభానుని నును లేత కిరణాలు
కారుణ్య కాంతి పుంజాలై
ముఖారవింద వర్ఛస్సుల నద్దాయి

ఎన్ని పూవులు, ఎనె్నన్ని రంగులు
అన్నన్ని పూపత్ర లాలిత్య మృదుత్వ
మధురాతి మధుర మనోహరమైన
ఆయన మనోభావాలు ఉద్వేగ రహితాలు
పలుకుల్లో పంచదార చిలుకలు

పసివాడి బోసినవ్వుల్లాంటి
లేగదూడ గెంతుల గంతుల్లాంటి
ఆకాశంలో దార్లేసే కొంగల్లాంటి
ఏటి తేట నీటి అలల్లాంటి
రేవుల్లో ఈదే చేపపిల్లల్లాంటి
వసంతంలో వినిపించే కోయల కూతల్లాంటి
గడ్డ పెరుగుపై మీగడ లాంటి
పిల్లల ఆటల్లో మురిపాల్లాంటి
పూవు చుట్టూ పరిభ్రమించే తుమ్మెదల్లాంటి
శూన్యానికి రంగులద్దే సీతాకోకల్లాంటి
నిండు పున్నమి వెనె్నల వెలుగులాంటి
బాలబంధు గేయాల్లో అంత్యప్రాసల్లాంటి
తళతళలాడే మిలమిలలాడే
స్ఫటిక స్వచ్ఛ నిలువెత్తు నుడికార
‘అలపర్తి’వారి అక్షరాలు
తెలుగు తల్లికి అదనపు ఆభరణాలు
బాల సాహిత్య శ్వాసకు సదా శ్రేయస్కురాలు
ఎనె్నన్ని పూవులు,
ఎనె్నన్ని సౌరభాలు, సౌందర్యాలు
అన్నన్ని అలతి అలతి అక్షరాల
అందాల పొందిక బాలల అందలానికి మెట్లు
సదాబాలుని సృజనలు సదా బాలల
ఎద నింపే తేటతెలుగు అమృత గుళికలు

- లలితానంద్ 9247499715