అక్షరాలోచన

భారతసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడు దేశాన్ని ప్రేమించాడు
స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని ప్రేమించాడు
విప్లవాన్ని ప్రేమించాడు
ప్రేమను విప్లవీకరించిన విప్లవ ప్రేమికుడై
ఉరికంబానే్న వధువుగా వరించాడు
అతడు సిలువనే పెళ్లాడిన స్పార్టకస్!

త్యాగానికి త్యాగాన్ని కలిపినా
త్యాగాన్ని త్యాగంతో హెచ్చించినా అతడే
విశ్వప్రేమ సంస్కృతిగా విలసిల్లేదాకా
మానవుల్లో కొందరిని
ద్వేషించక తప్పదన్నవాడు
ఆఖరి శ్వాసను కూడా సామ్రాజ్యవాద
నశింపు నాదం గావించినవాడు
అతడు విప్లవ ఆవాహకుడు! వాహకుడు!!

అతడు ప్రపంచ పీడిత జనతా నేస్తం
విప్లవ భావాల కొలిమిలో కాలి
కార్యాచరణ సానపై మొనదేలిన అస్త్రం

తాను పొదగబడిన వజ్రమే అయినా
పునాది రాళ్లను చూపించిన
ఉద్యమ శస్త్ర శాస్త్రం
అతడు నేస్తం, అస్త్రం! శస్త్ర శాస్త్రం!!

అతడు అరక్షణంలో ఆరిన దీపం కాదు
జ్వాజ్వలమానమై ప్రసరించే చైతన్యపు విద్యుత్తు
అతడు విప్లవ ప్రతీక కాడు
తానే విప్లవమైన
విప్లవ భావుకుడు ప్రేరకుడు చోదకుడు!!

అతడు సామ్రాజ్యవాదుల గుండెల్లో
సింహస్వప్నుడైన
భరతసింహుడు!! భగత్‌సింగుడు!!
*

-దివికుమార్