అక్షరాలోచన

దివ్వెల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారలు భువిలో వెలసిన భువన దీపాలు
దారి చూపి నడిపించే వెలుగు పుంజాలు
ప్రతి దీపం పరంజ్యోతి స్వరూపం

దీప తోరణాలు గృహ ఆభరణాలు
కాంతి కిరణాలు పసిడి రంగుల ప్రమిద దీపాలు
తిమిర సంహారాలు
అజ్ఞానాన్ని పోగొట్టి సంస్కార జ్యోతిని వెలిగింప
తోడ్పడే మార్గదర్శకాలు

విరజిమ్మి పైకెగసే పూలతో చిచ్చుబుడ్లు
రంగురంగుల వలయాల మతాబులు
అందాలు, ఆనందాలు కలబోయు మమతలు
మనలో నిలవాలని చెప్పే కవితలు

మన చిన్ని పాపలు సుప్రదీపాలు
కొత్త బట్టలు కట్టి పిల్లల మురిపాలు తీర్చేటి
అమ్మానాన్నలు
కొత్త అల్లుడితో వచ్చిన కన్నతల్లికి
గంపెడాశీస్సులు ఇవ్వరండి.

శ్రీకృష్ణ సత్యల స్మృతి నరక చతుర్దశి
మరునాడు దీపావళీ అమావాస్య
దీపాల వెలుగులో తారలు భూమిలో వెతికేను జాబిల్లి కోసం

సిరులమ్మ దీవెనలు కోటానుకోట్లు
కోరి కొలిచేవారి కొంగు బంగారు
చేయూత కోరేటి తోటి ప్రజావళి
చూడాలి సహాయ సౌందర్య దీపావళి

సంపదలు చేరాలి అన్ని వాకిళ్లు
వెలుగుతో నిండాలి అందరి కళ్లు.

-అనంత మురళీచంద్ర 09963887346