అక్షరాలోచన

జ్ఞాపకాల్లో మనిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం క్రమంగా
గమిస్తోంది
రోడ్డు రోలరులా
దొర్లుతోంది
తనకేం మిగుల్చుకోదు
అయినా
తాను పొరలిన గుర్తుల్ని
సైతం వదిలేస్తోంది
చదును చేస్తోంది
సమం చేస్తోంది
భూమి గాయాల్ని
మాన్పివేస్తోంది

కాలం గమిస్తోంది
కర్మయోగిలాగే
ధర్మనిరతితో
కాలం నిరంతరం
గమిస్తోంది
కానీ, కాలంతో ముడివడిన
మనిషి జీవితాన
జ్ఞాపకాలు
మొలుచుకొస్తాయి
అప్పుడు సరిగ్గా అప్పుడు
మధుర జ్ఞాపకాల్లో మనిషి
మనిషిలో జ్ఞాపకాలు
మిగిలిపోతాయి
కాలం తన ముందు
గడ్డు సమస్య ఐనప్పుడు
గడుసరి ఐనప్పుడు
మనిషి ఝడుసుకుంటాడు
జ్ఞాపకాల్ని వాటేసుకుంటాడు
కాలాన్ని జయిస్తాడు
బతుకును కొనసాగిస్తాడు.

-వాసాల నరసయ్య