అక్షరాలోచన

...నేటి మనిషి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుణభారం ఎక్కువై
దానిని తీర్చలేనప్పుడు
రుణదాతల కంటపడకుండా
తప్పించుకుని తిరుగుతూండటం
మనిషి నైజం!
వేరు జన్మలు ఉన్నాయో, లేవో
తెలియకుండానే
ఎన్నో జన్మలకు సరిపడేంతగా
తమ సంతానానికి ఎంతో సేవ చేస్తూ,
కాపాడుతూ, పెంచి పోషిస్తూ
ఎంతెంతగానో ప్రేమను
పంచిపెడుతూ కూడా
ప్రతిఫలాపేక్ష లేని
కరుణామృతమయ మహాదాతలు
కన్న తల్లిదండ్రులు!
పండుటాకు వయస్సులో
తమ సంతానం నుండి
తమకు కొంత మమత, సానుభూతీ,
పిడికెడన్నమూ తప్ప
మరేమీ కోరుకోరు వీరు!
సంతానం తమనెంత కష్టపెట్టినా
భరిస్తూ కూడా
తమ సంతానానికి చీమకుట్టినా
విపరీతంగా చలించిపోయి
కన్నీరు పెడతారు!
పైగా- తమ సంతానమెప్పుడూ
సుఖ సంతోషాలతో జీవింతురుగాక-
అంటూ దీవించే
గొప్ప దేవుళ్లు - తల్లిదండ్రులు!
అటువంటి - తల్లిదండ్రులను
మామూలు రుణదాతల కింద
జమ కట్టి,
వారి నుండి తప్పించుకోవడమెట్లా-
అని ఆలోచిస్తున్నాడు
నేటి మనిషి!

-రఘువర్మ 9290093933