అక్షరాలోచన

నివురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొగ
నిప్పులేందే రాదు
కోపం
ఊరకే రాదు
లోపలికి గుచ్చుకుంటేనే
రక్తం కారుతది
గాయమైన మనసే
దుఃఖమై పారుతది!

గుండె వత్తికి ఏదో
నిప్పు రవ్వ తగిలి
ఆగ్రహమై రగిలి ఉంటది
భూమి పగిలి
అగాధం పెరిగి ఉంటది!

ఏడ్వడం సరే
ఎడపెడ సరే
తప్పును కనుక్కోక
నిప్పును కనుక్కోక
పొగకు పొగా
పగకు పగా
ఎంతకాలం అలా!?
దిగడం మాని
దిద్దుకోవడం మాని
ఎందుకలా
ఆరిపోని పుండులా!

నిప్పులది
నీళ్ల గడ్డలదే కళ
నివురు గప్పి
పాకురుబట్టి
మనుషులుంటే ఎలా?

-ఏలేశ్వరం వెంకటేశ్ 9849487146