అక్షరాలోచన

తెల్లారని మనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రాత్రి
ఏ పగలు
నా యింటి ముందు తోరణం నవ్వటం
నేను చూడలేదు

ఏ ఉదయం
ఏ సాయంకాలం
నా ఇంటి వెనుక మల్లెతీగ
మందహాసం నేను చూడలేదు

ఏ అర్ధరాత్రి
ఏ వెనె్నల రాత్రి
నా మనసు పున్నమి వెలగటం
చిర్నవ్వు నక్షత్రం నేను చూడలేదు
ఏవి చూస్తున్నాను నేను?
సమస్యల బురద నీళ్లు
రాళ్ల దారిలో చావుడప్పులు
ముళ్ల బాటలో ఆత్మహత్యలు
చిర్నవ్వు సంగీతంలో
రేప్‌లు మానభంగాలు
నేనేం చూస్తున్నాను?
జీవితమంతా
తెల్లారని రాత్రి
కళ్లున్నా కనిపించని మనసు

-సిహెచ్.మధు 9949486122