అక్షరాలోచన

విరుగుడు కషాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేస్తమా! సృష్టి ప్రసవించినపుడు
సమస్య శిశువుతోపాటు
ఉమ్మనీటి సమాధానం ఉద్భవించింది
ప్రతి దారిద్య్ర విషానికి
విరుగుడు కషాయం ఉంది.

ధీరోదాత్తా! నీలో పుష్పించే ఉత్పత్తి వనరులు
నిగూఢ శ్రమశక్తి వినియోగంతో
ఆర్థిక దారిద్య్రాన్ని తరిమే కలియుగ కుబేరుడివి

స్నేహితుడా! నీలో పారిశుద్ధ్య పోషకాహార
నిక్షిప్త అవగాహనాచరణతో
ఆరోగ్య దారిద్య్రాన్ని తరిమే స్వస్థ కార్యదక్షుడివి.

నెచ్చెలీ! నీలో నివురుగప్పిన అక్షరాగ్ని
నిరంతర అభ్యసన సాధనతో
అక్షర దారిద్య్రాన్ని తరిమే బహుముఖ ప్రజ్ఞాశాలివి

ఆజానుబావా! నీలో నిరహంకార నిర్మలత్వం
అనంత విశ్వశాంతి పరివ్యాప్తితో
ఆధ్యాత్మిక దారిద్య్రాన్ని తరిమే జ్ఞాన ప్రబోధకుడివి

భజరంగభళీ! నీలో అపార నైపుణ్య సృజన దీప్తి
నీలాకాశానికి నిచ్చెనేసి అతికించిన
తళుకుల ధృవతారలా ప్రకాశిస్తూ
ఉద్యోగ దారిద్య్రాన్ని తరిమే విశ్వవిజేతవి.
*

-నాశబోయిన నరసింహ 9542236764