అక్షరాలోచన

పచ్చని చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చినుకు తాకిడికి విత్తులన్నీ నేల పొరల వాకిళ్ల నుంచి
నేలతల్లి గర్భం నుంచి మొలకెత్తి...
ఉదయించే కొత్త లోకాన్ని చూస్తాయి...
కాలుష్యం కమ్మేసినా...
మానవాళి ప్రాణాలకు ఆయుష్షును పోస్తాయి...
పంట చెరుకై తీపిని... వంట చెరుకై ఆహారాన్ని...
ఆయుర్వేదమై ఆరోగ్యాన్ని.. సుగంధ ద్రవ్యమై పరిమళాన్ని...
మన కోసం ధారపోస్తాయి.. అక్షరాలు విచ్చుకొన్న కాగితాలై...
రక్షణ కవచంలా హత్తుకునే వస్తమ్రై
కన్ను తెరిచి కన్ను మూసేవరకు
వృక్షాలతో మనది జన్మజన్మల అనుబంధం...
బ్రతుకునిచ్చే పచ్చని చెట్టును బ్రతకనిద్దాం...
కోట్లాది మందిని బ్రతికిద్దాం.. రండి
ఒక్కో తరం ఒక్కొక్క మొక్కయినా నాటుదాం...
భావితరాలకు హరిత లోకాన్ని సృష్టిద్దాం...
మొక్కే మన ఆయువు... ప్రాణ వాయువు...
హరిత హారంతో.. బంగరు భవితకు బాటలేద్దాం.

-గుండు రమణయ్య 9440642809