అక్షరాలోచన

రుతువుకో రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చేరుకోవాల్సిన గమ్యం ఎప్పటికైనా అదే..
కానీ నా చిన్ని రెక్కల కదలికలు ఈసారి వ్యతిరిక్తంగా ఉన్నాయ్!
నా స్వరం సిద్ధమై పెగలకముందే ‘గ్రీష్మం’ కర్కశంగా తరుముతోంది..
ఇక్కడికి దూరంగా ఎక్కడికైనా ఎగిరిపోవాలి
సమయం కంటే ముందే శిశిరం శిథిలమై పోయి జీవచ్ఛవంలా మారింది
మృతపల్లవులే తప్ప చివురించే ప్రణయ గీతికలు లేవు!
పరవశించి ప్రతిధ్వనించే తొలకరి విరహ వేదనల జాడలేదు!
విడిచిపెట్టి వచ్చిన వసంతమే మళ్లీ పిలుస్తోంది!
అది వెచ్చగా ఇంకా మండుతూనే ఉంది...
ఎప్పటివో జ్ఞాపకాలు ఓ మూల ఎండుటాకుల్లా సుడులు తిరుగుతుంటే-
వలసపోయి ఏ గీతాన్ని పాడేది?
కొత్తగా కలత చెందుతున్న గాత్రం నాది
కాలగమనంలో అపశృతులు నా కర్తవ్యాన్ని చెరిపేస్తున్నాయి!
మువ్వలు జారిన స్పర్శతో నాట్యాన్ని మధ్యలోనే ఆపి
మయూరాలు నిశ్శబ్దంగా తరలిపోతున్నాయి
మంజీర నాదం మంచుతో తడిసి మురిపిస్తుందనుకుంటే
పరదాలను తీసేస్తూ ‘హేమంతం’ ఈ దేశం దాటిపోతోంది
వడి మార్చుకున్న రుతుచక్రానికి నా స్వరాన్ని గుర్తుచేస్తే?
ఎపుడో అంతర్థానమై పోయిన పాటని కొత్తగా నేర్చుకోవాలి.
కాలం తెలియని వర్షమేదో అకారణంగా కబళిస్తోంది
కొంచెం కొంచెం గూడు చెదిరి గుండె పగులుతోంది
తడిసిన రెక్కలు భారమై స్వరం క్షీణించింది
కర్మఫలాన్ని దిగమింగుతూ గొంతు సవరించుకున్నా
రుతువుకో రాగంతో శృతి తప్పుతూనే ఉన్నా!*

-కాళిదాసు ఆనంద్ 9133366955