అక్షరాలోచన

వ్యాకుల రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలుగు వెనె్నలయే మలిసంజెవేళ
పేరు తెలియని రాగంతో పాట
ఎక్కడ మొదలై వస్తుందోగాని
ఇపుడు తడి స్పర్శతో
నన్ను తీగలాగ అల్లుకుని
మునపటి జ్ఞాపకాలతో
మనసును తడిపి ముద్ద చేస్తోంది
ఇదే రాగబంధమో గాని
ఎక్కడో లోయలూ.. శిఖరాలు
నదులూ... నగాలు దాటుకుని
నన్ను వెదుక్కుంటూ వచ్చి
నాకు మాత్రమే తెలిసిన
సంకేత భాషలో సందేశాలను తెస్తుందేమో
గుండెను తొలిచి.. తీయటి బాధను రేపి
జీవ రహస్యాలకు మార్కిక మలామా అద్దినట్టుంది.
ప్రాణాలను మరగించి.. కాలాన్ని నిలువరించి
మనసును పదును చేయగానే
మరపు తీరాల్లోని దీపాలను వెలిగించుకుంటూ
పోగొట్టుకున్న స్పర్శను అందిపుచ్చుకుంటూ
మరణమూ మధురమనిపించేలా
కెరటాలు కెరటాలుగా తాకిన దుఃఖాన్ని
బొట్టుబొట్టుగా చప్పరించాక
వేదన.. వెనె్నలా జమిలిగా చేరి
చింతచెట్టుకు కట్టిన ఊయలలో
పాటతో నన్ను ఊపుతున్నపుడనిపిస్తుంది
దుఃఖం అనాదిదని
దుఃఖించడం అనివార్యమని.
*

-ఆవాల శారద 9295601447