అక్షరాలోచన

గమ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాదే కులమని అడిగాడో మిత్రుడు
నాదే కులమైతే నీకేంటి
ఏ మతమైతే ఎవరికేంటి
ఎవరెటు పోతే నాకేంటని అరిచాను!

మానవత్వం కుప్పకూలుతుందనే ఆలోచన వెంటాడుతుంది
తోయబడ్డాను అగ్నిఖిలల సుడిగుండంలోకి
ఏడవడమే మిగిలింది
ఎందుకేడవాలో అర్థం కావట్లేదు ఈ కసాయిల వనంలో!

నీవు ఫలానా వాడివైతే కచ్చితంగా చాందసుడివని
ఫలానా కులమైతే కుసంస్కారివనంటున్నారే

ఈ భూమీద పుట్టేటప్పుడు
మా అమ్మను అడగాలా
తనదే కులమని
మా నాన్నను అడగాలా
తనదే మతమని
నీ మూర్ఖత్వం అదే ప్రశ్నిస్తే
చచ్చే ముందే రాసిపెడతాను
ఇదే కులంలో
ఇదే మతంలో
మళ్లీ పుడతానని!

నా అభిప్రాయం నీకు భారమైతే
ఏముంది
కలసినప్పుడు తల తిప్పుకుంటావు
లేదా అసహ్యించుకుంటావు
ఏమవుతుంది
నీది గోదారని మురిసిపోతావు
నాది అడ్డదారని నవ్వుకుంటావు

ఏ దారి ఏటన్నా పోనీ
చివర ఒక గమ్యం ఉంటుంది
అది సముద్రమో లేక మురుక్కాలువో
చేరిన తర్వాత తెలుస్తుంది నీకు నాకు!

**

-కృష్ణమణి