అక్షరాలోచన

జీవితంలో నువ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూడిద నించి మొలకెత్తిన
రేపటి విత్తులు చూడు చూడు
కూల్చడం గొప్ప కాదు
నిర్మించడమే కష్టం. ఎన్ని జీవితాలు
చీకటిలోకి వెళ్లిపోయాయో చూశావా?

జీవితం తగలబడి పోయాక
మిగిలేది గుప్పెడు బూడిదనే కాదు
గుప్పిట జారవిడిచిన జ్ఞాపకాలు కూడా
దారి ఎప్పుడూ ఆగిపోదు
వేగంతో అడుగులేస్తూ నడుస్తున్న
నిన్ను లక్ష్యం వరకు చేరవేస్తుందో లేదో
ఇప్పుడేం చెప్పగలం?

నీతో నీవు, నీలో నీవు
పడుతూ లేస్తూ పరిగెడుతూ
ఇంకొక లోకంలో కడ వరకు
సాల్వేషన్, ముక్తి కొరకు
రంధి పడుతూనే ఉంటావు

వ్యక్తి నుంచి సమూహానికి
మలచబడ్డ మట్టి బొమ్మవి
విధి లిఖితంలో రాయబడని గీతవై
నిలబడ్డ నిలువెత్తు సాక్ష్యానివి

నువ్వు, జీవితం
రెండు వేరు కాదు
చావు పుట్టుకల సమ్మిళితం
అనంత సత్యానికి
అంతికమ సంకేతమే - నువ్వు.
*

-పుష్యమీసాగర్ 9032215609