అక్షరాలోచన

మాట్లాడుతూనే ఉన్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడిప్పుడు
నాతో మాట్లాడుతున్నాడు
గుండెల్ని పెనుమంటల్ని చేసినవాడు
పిడికిలితో సూర్యుడి నెత్తి మీద ఈడ్చి తన్నినవాడు
రణరంగంలో అశోకునివలే బౌద్ధ దీక్ష తీసుకున్నవాడు!
బుద్ధుడిలా ప్రజ్ఞని ప్రకటించినవాడు
అంబేద్కర్ చూపుడు వేలుతో
మనువు కళ్లను సూదితో గుచ్చినవాడు
భేతాళుడిలా సంచరించినవాడు
పరమ చండాల చరిత్రని పదిలపరచినవాడు
అతడిప్పుడు నాతో మాట్లాడుతున్నాడు
అరే! కవిత్వం అంటే
‘ఆకాశం భూమి కరచాలనం చేయాలిరా!’
‘పీనుగుల పెంటల మీద నడిచి వెళ్లినట్టు రాయాలిరా!’
పదేపదే
తన ధిక్కార స్వరంతో
నిత్యం రగులుతున్న కొలిమి నిప్పుల వేడిలో రగిలిస్తున్నాడు
అతను ఇంకా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు.
*
(కలేకూరి ప్రసాద్ (యువక) జయంతి సందర్భంగా)

-తంగిరాల - సోని 9676609234