అక్షరాలోచన

అంతరంగ ఆలోచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తురంగ విహంగంతో లోక వీక్షణ..!!
ఎన్నో సందేహాలు, ఆరాటాలు, పోరాటాలు!!
చిక్కుముడుల నడుమ అజ్ఞాతశక్తి..!
అదే ఈ సృష్టికి మూలమట..!!

పంచభూతాల సృష్టి కర్తట..!!
నీటిలో మునగదట..!!
గాలిలో తేలదట...
నిప్పుల్లో కాలదట..
నింగిలో కనిపించదట...
నేలపై నడవదట..
అది ఓ అందని శక్తిట...!!
అది ఉందో లేదో నాకెందుకట..

ఉన్నచో నాకు కనిపించిన..
నిలదీస్తా.. ప్రశ్నలతో దాడిచేస్తా..
ఆడబిడ్డల మానభంగాల గురించి..
కన్నీటితో కడుపు నింపుకునే బీద వారి గురించి..
కరువులు, వరదల గురించి..
కుల మత భేదాలు గురించి..
.. ఎన్నో.. మరెన్నో కష్టాల గురించి..!!

అదృష్ట శక్తి ఉన్నా.. లేకపోయినా నాకెందుకులే..
ఒక్కటైతే యే యెరుగుదును..లే..
మరణం తథ్యమని
జీవికి మృత్యువు తప్పదని..
తోటి జీవులకు వేదన తప్పదని..
కడకు మనకొక సమాధి...
అదే మన కొత్త జీవితానికి పునాది!! *

-జాని తక్కెడశిల 9491977190