అక్షరాలోచన

కొన్ని శ్రమ జీవితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలి నిద్ర
రెండు పెనవేసుకొని
పేదరికమై
పేవ్‌మెంట్ మీద పడుకుంటుంది

పగలు రాత్రి
రొదలు చెవికెక్కని
శ్రమ జీవితం...
దొరికిందేదో
కడుపుకీ, పరమాన్నమే నిత్యం
బతుకు ఎక్కడైనా
కష్టాల తొవ్వ నుంచి
నడవాల్సిందే

ఎప్పుడు భూమీద పడ్డారో
మట్టిగా మారేవరకు
శ్రమ కణమై
రగులుతుంటారు

సాయంత్రపు నీరెండలో
చెమట చుక్కలు
బుక్కెడు బువ్వకై
కొట్లాడతాయి

దుర్గంధాల
ప్రపంచంలోనే
శే్లష్మంలోని ఈగలా
కొట్టుమిట్టాడతాయి

కాలాలు కాలికి
తొడుక్కొనే చెప్పులే
ముగిసిపోతాయి
కొన్ని కథలు...
మొలకెత్తుతాయి ఆశలు విత్తనాలు
ఇంతింతై వటుడింతై!! ఇది నిత్య సత్యం
*

-పుష్యమీ సాగర్ 9032215609