అక్షరాలోచన

ఊడలమర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినికిడి శక్తి తగ్గింది నిజమే
అయనా చెవిన పడుతున్నాయ
అనగూడని నోళ్లనుండి
వినగూడని మాటలు
మందగించిన చూపు కూడ
గమనిస్తుంది ‘చిన్నచూపు’ను
వద్దనుకున్నా కంటబడుతున్నాయ
చికాకుపడుతున్న ముఖాలు
విసుక్కుంటున్న దృశ్యాలు
ఎంత మతిమరుపున్నా
మరచిపోలేకపోతున్నది
మనసులోని బాధలను
కడుపులోని ఆకలిని
చులకనగా చూసేవారు
నిర్లక్ష్యం చేసేవారు
ముల్లుకర్రలై రేపుతున్నారు
పాత గాయాలను
ముందూ వెనకా
ఎందరున్నా లెక్కకు
సడలుతున్న నమ్మకాలతో
అశాంతి ఆందోళనలు
తెలియని అభద్రతా భావం
ఇంతింతై వటుడింతై తొక్కేస్తుంది
అంతులేని అగాధంలోకి
అయనా సరే ఓడేది లేదు
కుంగుబాటుకు లొంగేది లేదు
పాతాళంలో కూడ ప్రవహిస్తుంది
ప్రాణాలు కాపాడే గంగ
ఆత్మవిశ్వాసం అపారంగ
అనుభవాల ఊడలే ఆధారంగా
మర్రిమాను నిలబడే ఉంది సగర్వంగా

- వేముల ప్రభాకర్, 9533120533