అక్షరాలోచన
సాయంసంధ్యా రాగాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 April 2016
-అయాచితం నటేశ్వరశర్మ 9440468557
అక్కడ సాయంకాలాలు చదువుకుంటాయి
అక్కడ తరువులు తపస్సు చేస్తాయి
కొమ్మలు బొమ్మలు గీస్తాయి
రెమ్మలు కమ్మగా పాడుతాయి
రాళ్లూ రప్పలూ నిశ్శబ్దంగా పాఠాలు వింటాయి
గోడలు కావ్యగంధాలతో పరిమళిస్తాయి
లతలు పదబంధాలతో అల్లుకుంటాయి
సృజన పద్య పుష్పమై వికసిస్తుంది
అడుగుల సవ్వడులలో
అందమైన ఛందో గుణాలు లయిస్తాయి
నేలలు చరిత్రలు చెబుతాయి
చీకటి పడుతున్న కొద్దీ
చింతన దీపాలు ఎదలో వెలుగుతాయి
చర్చల చందన స్పర్శలతో
రాత్రి పున్నమి చంద్రుడు ఉదయిస్తాడు
తెల్లవారేదాకా రమణీయానుభూతినిస్తాడు
ఉల్లపు కాగితం మీద స్నేహ సంతకం చేస్తాడు.
*