అక్షరాలోచన

అమ్మ చేతిలో పిల్లనగ్రోవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇంటి చూరు కింద కుంపటి
పస్తుల పూటల్ని దాటుకుంటూ
ఇయ్యాల.. కాస్తంత రాజుకొంటుంది
ఒళ్లంతా పేదరికాన్ని కప్పుకున్న
కట్టెలు కూడా కనికరంగా
పెళపెళమంటున్నాయ

కుంపటిపై కుండ కాగితే
నాలుగు ముద్దలు ఉడుకుతాయ
ఆత్రంగా ఎదురుచూసే
ఆ బక్కచిక్కిన కడుపున
ఆకలి తీర్చే జావవుతాయ
అందుకేనేమో... పేగుల్ని బిగబెట్టుకుని
గుండెలదాకా ఊపిరి పీల్చుకుని
అమ్మ... పొగ గొట్టం
ఆత్రంగా ఊదుతోంది
పొగబారిన ఆ కళ్లకు
బిడ్డ ఆకలి స్పష్టంగా కనపడుతూనే ఉంది
ఇప్పుడు అమ్మ చేతిలో పొగ గొట్టం
బిడ్డల ఆకలి తీర్చే పిల్లనగ్రోవి
అందుకే... మరింత తన్మయత్వంతో
ఆ డొక్కల్లో గాలి ఎగదన్నుతోంది
కుండపై జావ పొంగుతోంది!

- గంగాధర్ వీర్ల, 9502328972