అక్షరాలోచన

చీకటి బతుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియాన్ లైట్ల వెలుగులో
సుఖమెరుగని నిద్ర...
రోడ్డు పక్కన చెత్తకుండీలో
రుచి ఎరుగని ఆకలి
డబ్బున్న తాగుబోతుల వినోదానికి
భద్రతలేని బతుకు భయం
నగర మృగాళ్ల విహారానికి
మూలన దాక్కొన్న పసిలేడి కూనలు
పగలంతా రెక్కలు ముక్కలు అయినా
రాత్రి భయం వెంటాడుతుంది
కాలుష్యపు కాటుకి బలైపోతూ
బక్కచిక్కిన దేహాలు
సంఘం దృష్టిలో పనికి రాని ‘మనుషులు’గా
చెలామణి అవుతున్న, పేవ్మెంట్‌గాళ్లు
జనాభా లెక్కలో కనపడని ‘ఓటర్’లు...
ఎవరికీ అక్కర్లేని ‘అనాధ’ బతుకులు
నిత్యం పుడుతూ.. చస్తాయి...
రోజు బతకడానికి యుద్ధం చేస్తుంటాయి..!!
*

-పుష్యమీ సాగర్ 9032215609