అక్షరాలోచన

రక్త సంబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక హృదయం నోచిన ఫలములు
ఒక మదిలో పండిన వరములు
అన్నాచెల్లెళ్లు అనురాగపు చంద్రికలు మమకారపు మాలికలు
చెల్లాయి నవ్వులో కురిసే ముత్యాలు
అన్నయ్య ఇంటిలో వెలసే భాగ్యాలు
చెల్లి ఆశాలతకు జీవజలం అన్న
అన్న సన్నిధిలో ఆకాశం అందుకొను చెల్లి
చెల్లి ఇల్లాలై వెళ్లి కంటికి దూరమైనా
అన్న అరచేతిలో ఆమె అడుగుల గుర్తు చెదిరేనా
అన్నకు చెల్లి ఆరోప్రాణం
చెల్లికి అన్న మూడో నేత్రం
చెల్లాయి గుండెకు గొంతుంటుంది
అన్నయ్య మనసుకు చెవులుంటాయి
అన్నంటే తల్లి మాట తండ్రి బాట
చెల్లి రక్షణకు నిలిచిన చక్కని కోట
అన్న దీవెన దుర్గమయి నిత్యము కాచు
అన్న దయ ఆ స్వర్గమునే ముంగిట దించు
అంతులేని ఆవేదనలో కంటికి వెలుగయి నడిపించు
చెల్లి పచ్చని సంసారంలో పసిడి కాంతులను ప్రసరించు
మచ్చలేని స్వచ్ఛమైన మల్లెపూల చందం
మాయమర్మమెరుగని మధురమైన బంధం
అన్నాచెల్లెళ్ల అనుబంధం మమతలొలికిన మకరందం
రెండు మనసులను ఒకటిగ నిలిపిన రక్తబంధం.
*
(7 ఆగస్టు 2017 రాఖీ పండుగ సందర్భంగా)

-చిరమన వెంకట రమణయ్య 9441380336