అక్షరాలోచన

ఆత్మీయ అనురక్తికై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మీయ స్పర్శ కోసం
మేను ఎదురుచూస్తూ
సంప్రీతి పిలుపు కోసం
చెవులు రిక్కిస్తూ
మాలిమి చూపు కోసం
మనసు విప్పారటం చూసి
వృద్ధాశ్రమం వొణుకుతూ ఉంది
నడక తడబడుతూ ఉంది
మాట ముక్కలౌతూ ఉంది
చూపు మసకబారి ఉంది
నిద్రిస్తూ మేల్కొంటూ
కలవరిస్తూ కలలు కంటూ
కాలం ద్రవీభవిస్తూ
ఘనీభవిస్తూ
గాలి పరుగెడుతూ
గడ్డ కడుతూ
కాంతి చొరబడుతూ
మాయవౌతూ-
బాల్యం కౌమారం వ్వనం
వృద్ధాప్యానికి బహమూర్తి!
అతడు లేచే ప్రయత్నం
మంచం సహాయ నిరాకరణం
పోటీపడి అతడు గెలిచాడు
పళ్లెం జారిపోయింది
మనసు గుర్తించినా
చేతులు సహకరించలేదు
అతడు కన్నబిడ్డ అదే జిల్లాను
పాలిస్తున్న ఉన్నతోద్యోగి
చేతుల్ని కష్టంగా కూడగట్టినా
వేళ్లు పలు దారుల్లో కదలక నిల్చున్నాయి
ఆత్మీయ అనురక్తికై వెతుకుతున్నాయి
ఆమె నడవబోయింది
కాళ్ల కింద భూమి జారిపోతూంది
కన్నీరు చెక్కిళ్లపై
వరద ప్రవాహమైంది
కండలు ఎండుకున్నాక
కాళ్లు చేతులు కట్టెలయ్యాయి
ఏడ్పుకు భయపడ్డ నిశ్శబ్దం
శబ్దాన్ని తోడు తెచ్చుకుంది
దేశాన్ని ఏలుతున్న
ఢిల్లీ అమాత్యుడు ఆమె బిడ్డ
చూపు అవ్యక్త బాధను
మోసుకొచ్చింది
రక్తబంధాన్ని వెతుకుతూంది
మారని ఆకాశాన్ని
మారిన వృద్ధాప్యం గమనిస్తూ ఉంది!

అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946