అక్షరాలోచన

మరణశాసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమల విల్లుల నుండి వదిలిన
కాలుష్య శరములు అదుపు చేయలేక
వాయు దేవుడు అలసిపోయిన నాడు
జీవుల శ్వాసలు చావుకేకలు వేస్తాయి

రసాయనాలతో ఆహారాన్ని కల్తీ చేసి
అమ్మి సొమ్ము చేసుకొని మురిసిన నాడు
రోగాలు చుట్టుముట్టి బక్కచిక్కిన మనుషుల
మరణ మృదంగం నలుదిక్కులా వినిపిస్తుంద

బోరుబావులు వేసి నేలతల్లిని తొలిచి
మంచినీటిని పీల్చి వృధా చేసిన నాడు
బీడుబారిన ధరణి శాపాలకు
విమోచనం లేక ఎండిన గొంతులు
వింత ధ్వనులు చేస్తాయి.

ధర్మదేవతకు సంకెళ్లు వేసి మానవత్వం మరచి
మంచి మార్గం విడిచి చెలరేగిన నాడు
అధర్మ వనంలో అవినీతి మృగాల మధ్య
మనుషులు జింక పిల్లల వలె
ప్రాణాల కోసం పరుగులు తీస్తారు.

వృక్షాలను నరకడం ఆపని నాడు
ప్రకృతి మాత ప్రేమకు దూరమై
మనుషులు పసిబిడ్డల వలె ఏడ్చి
అనాధలై నశించిపోతారు.

ప్రకృతి రక్షణ క్షేత్రాన్ని
పుణ్యక్షేత్రంగా భావించి
దైవాన్ని చూడలేక అంధత్వంతో
మనిషి లిఖిస్తున్న ఈ మరణ శాసనాన్ని
భావితరాలు చూసి
మాయని రాతలను చెరపలేక
విసుగెత్తి దుమ్మెత్తిపోస్తారు.

ఎ.రజిత 8978318393