అక్షరాలోచన

జనం జండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓడిపోవటం, గెల్వటం సంగతేముంది
యుద్ధరంగమే లేనపుడు
జనాన్ని శత్రువు తరుముతున్న మాట నిజం
పొలాలు ఇల్లు విడిచి పారిపోతున్న మాట నిజం
కాళ్లు నిల్చిన స్థలంలో కూడా
కాంతిలేని జీవితం జనానిది
కష్టం మొలకెత్తిన పొలాలలో కూడా
శాంతి లేని జీవనం జనానిది
ఎవరు నిలిపారో
జనం గుండెల మీద అమావాస్య నిలిపారు
ఎవరు శత్రువు
రాత్రి దీపాన్ని ఆర్పేస్తున్నారు
జనం కన్నులు కాంతి పుంజాలు
జనం మనసులు అగ్ని గోళాలు
జనం గుండెలు మండుతున్న కొండలు
వాళ్లకు శత్రువు తెల్సు
శత్రువు నీడ తెల్సు
శత్రువు ఎవరో తెల్సు
పక్కనే పచ్చనోట్ల బురఖా కప్పుకొని
కత్తి మొనల మీద ప్రేమ మాటలు కురిపిస్తున్న
వాడెవడో జనానికి తెల్సు
జనం యుద్ధానికి సిద్ధంగా లేరు
ఇంకా యుద్ధరంగాన్ని నిర్మించలేదు.

-సిహెచ్.మధు 9949486122