అక్షరాలోచన

డూడూ బసవడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత చిరుగుల బొంతోటి
నడ్డి నేసుకుని
పాతచీర పీలికలు
కొమ్ములకు చుట్టుకుని
డోలు సన్నాయి వెంటరాగా
ఓ గంగిరెద్దు నా ఇంట ముంగిట నిలిచింది

రంగు వెలసిన చీరల తలపాగాలు
చంకన చిన్న బొంత సంచీలు
సన్నాయి పంచెకట్టగా
డోలు లుంగీ చుట్టింది.

ధర్మమని సన్నాయి కోరగా
డోలు మోతగా ఆడగా
కుదురుగానైనా నిలువని గంగిరెద్దు
బెదురుచూపులు చూస్తోంది

పదేళ్ల గుంటకు చీర కట్టినట్లున్న
గంగిరెద్దును చూసి
ఇది ఆడదా, దండాలు పెట్టదా
డూడూ బసవనే్ననా అన్నా

సన్నాయి తానే డూడూ బసవడై
తలూపుతూ ఇది మగదే బాబూ
పండగ పూట ఓ రూపాయి డబ్బుల కోసం
ఓ అయ్యకాడ నుంచి తోలుకొచ్చాం
దీన్ని నిలవరించడమే
సాన కట్టమై పోతంది అన్నాడు.

-నారాయణమూర్తి తాతా 9280 044 001