అక్షరాలోచన

రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలుతున్న శవాన్ని చూసి
వేదాంతం కమ్ముకొస్తుంది
నోట్ల కట్టలు చూడగానే
బుద్ధి చంచలవౌతుంది
- శ్మశానవైరాగ్యం
అంత అల్పాయుష్కం!
కష్టాల కడలిలో
కొందరు
సుఖాల ఒడిలో
మరికొందరు
- స్వర్గం, నరకం
ఈ భూమీదే!
క్రమశిక్షణ
చీమది
ఐకమత్యం
కాకిది
- ప్రకృతే
పెద్ద పాఠశాల
అన్ని జ్ఞానాలను
మించినది
తన్ను తాను
తెలుసుకోవటం
- ఆత్మజ్ఞానమే
అసలైన జ్ఞానం

విజయానికి
ప్రారంభం
గెలవాలన్న
ఆశ
- పెను వృక్షానికి మూలం
చిన్నబీజమే!

ఎండాకాలం
చల్లదనం కోరతాం
చలికాలం
వెచ్చదనం ఆశిస్తాం
- అందని దానికోసమే
మనిషి ఆత్రం

- తోట శ్రీనివాసరావు 8977066980