నల్గొండ

కేంద్రీయ విద్యాలయ నిర్మాణ స్థల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, జనవరి 21: కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయడమే కాకుండా విద్యాలయ నిర్మాణం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడకు మంజూరయిన కేంద్రీయ విద్యాలయం కొరకు జప్తి వీరప్పగూడెం దగ్గర కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఆర్డీఓ కిషన్‌రావులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి త్వరితగతిన చేపట్టి పూర్తిచేయాలన్నారు. జిల్లాకు రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మంజూరు చేయించానని ఆయన వెల్లడించారు. కాగా కేంద్రీయ విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిన భూమిలోకి వెళ్లడానికి రోడ్డు లేనందున రోడ్డు కొరకు శాంతినికేతన్ కళాశాలకు చెందిన మాలి ధర్మపాల్‌రెడ్డి, రైతు ధనావత్ శేవ్యానాయక్‌తో మాట్లాడి 40్ఫట్ల రహదారి కోసం 10గుంటల స్థలాన్ని వారి నుండి దానంగా కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలని సూచించగా వారు సానుకూలంగా స్పందించి రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారని ఆయన తెలిపారు. భవన నిర్మాణం, కాంపౌండ్‌వాల్, అప్రోచ్‌రోడ్డు పనులను రెండు, మూడురోజులలో ప్రారంభించనున్నట్లు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంపిపి ఒగ్గు జానయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చిరుమర్రి కృష్ణయ్య, భిక్షంగౌడ్ పాల్గొన్నారు.
బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే
సమాజంలో గౌరవం: ఎస్పీ
నల్లగొండ రూరల్, జనవరి 21: బాధ్యతలను సక్రమమైన మార్గంలో నిర్వహిస్తే సమాజంలో గౌరవంతోపాటు పోలీసు విభాగానికి మంచి పేరు వస్తుందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. గురువారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎ ఆర్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 24మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులతోపాటు బాధ్యతలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమలో ఎఎస్పీ గంగారామ్, ఓఎస్‌డి ఎఆర్ శ్రీనివాసశాస్ర్తీ, ఆర్‌ఐ శ్రీనివాసరావు, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు రామచంద్ర గౌడ్, అమర్ సింగ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి
ఆలేరు: వాహనదారులు, ప్రయాణికులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రాణాలు కాపాడుకోవచ్చని భువనగిరి ఎంవిఐ వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆలేరు పాల శీతలీకరణ కేంద్ర ఆడిటోరియంలో 27వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా వాహనదారులకు, పాఠశాల యాజమాన్యాలకు, డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాలవల్లే జరుగుతున్నాయని, వాహనం నడిపేటప్పుడు, వాహనస్థితి గతులు, రోడ్డు నిర్మాణం, భౌతిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్‌లను దరించాలన్నారు. ఈ సందర్భంగా వారిచేత రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నర్సింహులు, ఎఎంవిఐ నగేష్, ఎఎస్‌ఐ సాయినాధ్, డ్రైవర్ అసోసియేష్ అధ్యక్షులు రాంచంద్రారెడ్డి, భాస్కర్, కృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : ఎస్పీ
నల్లగొండ రూరల్, జనవరి 21: రోడ్డు భద్రతా నియమాలు ప్రతిఒక్కరు పాటించాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ కోరారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐవైఎస్‌వో టీమిండియా సంస్థ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, మోటర్ వెహికిల్ చట్టాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి రహదారి భద్రతా పోష్టర్‌లను విడుదల చేశారు. అనంతరం విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహమతులు అందజేశారు. ప్రజలు ట్రాఫిక్ చట్టాలు, ట్రాఫిక్ గుర్తులు, రహదారి భద్రతా, మోటార్ వెహికిల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎఎస్పీ గంగారామ్, ట్రాఫిక్ సిఐ ఆదిరెడ్డి, ఐవోఎస్‌వో సంస్థ సిబ్బంది ఓజ, బలరాం, సాగర్, రాజు. శేఖర్ పాల్గొన్నారు.
వాహన చోదకులకు పూలతో భద్రతా సూచనలు
కోదాడ: రోడ్డ్భుద్రతా వారోత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణ ఇన్సిపెక్టర్ మామిళ్ల శ్రీ్ధర్‌రెడ్డి డ్రైవర్లు, వాహనాల చోదకుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు వినూత్న పద్దతిని ఎంచుకొన్నారు. 65వ, నెంబర్ జాతీయరహదారిపై వున్న కోదాడ పట్టణ బైపాస్‌పై వెళుతున్న వాహానాలను నిలిపి డ్రైవర్లకు, వాహనాల చోదకులకు విద్యార్ధులతో కలిసి ఇన్సిపెక్టర్ శ్రీ్ధర్‌రెడ్డి గులాబి పూలు ఇచ్చి రోడ్డ్భుద్రతపై అవగాహన కల్పించారు. సీటు బెల్టు పెట్టుకోవాలని, మితిమీరిన వేగం ప్రమాదకరమని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ఓవర్‌లోడ్ ప్రయాణం ప్రమాదమని చెపుతూ ఇన్సిపెక్టర్ శ్రీ్ధర్‌రెడ్డి డ్రైవర్లలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో కోదాడ పట్టణ ఎస్‌ఐ దోసపాటి సురేష్‌కుమార్, ట్రాఫిక్ ఎస్‌ఐ ఇండ్ల వెంకటయ్య, ఎయస్‌ఐ సుందరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.