నల్గొండ

మళ్లీ రోడ్డెక్కిన రైతులు గన్నీ బ్యాగ్‌లు లేక ఆగిన కొనుగోళ్లు కంది రైతుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 22: నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు గన్నీ బ్యాగ్‌ల కొరతతో ఆగిపోవడంపై ఆగ్రహించిన కంది రైతులు మరోసారి రోడ్డెక్కి రాస్తారోకోతో తమ నిరసన తెలిపారు. గురువారం మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున నిల్వ ఉన్న కందుల కొనుగోలుకు కనీసంగా 16వేల గన్నీ బ్యాగ్‌లు అవసరమయ్యాయి. అందుబాటులో ఉన్న వేయి బస్తాల మేరకు కొనుగోలు చేపట్టగా ఇంతలోగా హకా సంస్థ పంపిస్తామన్న మరో పదివేల బస్తాలు మార్కెట్‌కు చేరుకోకపోవడంతో కొనుగోలు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. అప్పటికే గన్నీ బ్యాగ్‌ల కోసం పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. గన్నీ బ్యాగ్‌లు లేవన్న సమాచారంతో వారంతా ఆగ్రహంతో నల్లగొండ-హైద్రాబాద్ రోడ్డుపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఇప్పటికే తాము రెండు మూడు రోజులుగా మార్కెట్‌లో పడిగాపులు పడుతున్నామని అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో గన్నీ బ్యాగ్‌లు రాక కొనుగోలు మరింత ఆలస్యమవుతుందంటు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ ఏడి అలీమ్‌తో చర్చించి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే 50వేల గన్నీ బ్యాగ్‌లు తెప్పించాలంటు డిమాండ్ చేశారు. నల్లగొండ మార్కెట్‌లో కొనుగోలు ఒత్తిడి తగ్గించేందుకు మిర్యాలగూడ, హాలియాల్లో కందుల కొనుగోలు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కంది రైతులు ఇబ్బందులు పడుతున్నారంటు ఆరోపించారు. కాగా హకా నుండి రావాల్సిన గన్నీ బ్యాగ్‌లు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు అధికారి సమ్మిరెడ్డి వెంటనే సూర్యాపేటకు వెళ్లి 16వేల గన్నీ బ్యాగ్‌లను తీసుకరావడంతో సాయంత్రంకల్లా కొనుగోలు మొదలైంది. ఈ సమస్యపై మార్కెటింగ్ శాఖ ఏడి అలీమ్ మాట్లాడుతు నల్లగొండ మార్కెట్‌లో ఆరువేల బస్తాల కందులకు తోడు గురువారం రైతులు మరో పదివేల బస్తాల కందులు తీసుకవచ్చారని అప్పటికి మార్కెట్‌లో వేయి గన్నీబ్యాగ్‌లే ఉండటం, హకా నుండి సకాలంలో గన్నీ బ్యాగ్‌లు చేరకపోవడంతో కొనుగోలుకు అంతరాయం ఏర్పడిందన్నారు. రైతులు ఆందోళన చేస్తున్న సమయంలోనే తమ అధికారులు 16వేల బస్తాలు తెప్పించి కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టారని తెలిపారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
ఆత్మకూర్(యం), ఫిబ్రవరి 22: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌యస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సర్వపల్లి, రాయిపల్లి, కొరటికల్, ఆత్మకూర్(యం) గ్రామాల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా 36మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రధానంగా ఆడపిల్లల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా ఉన్న బునాదిగాని కాల్వ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామన్నారు.

ఉద్యోగాలిస్తామంటూ ఆపరేటర్ల నుండి..
డబ్బులు వసూలు

మంత్రి జగదీష్‌రెడ్డిదే బాధ్యత
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సబ్ స్టేషన్‌లో ఆపరేటర్ల పోస్టుల భర్తీ చేస్తామని ఓక్కో పోస్టుకు 5లక్షల 30వేల చొప్పున డబ్బులు వసూలు చేశారని ఈ డబ్బులు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డికి వెళ్లాయా లేక ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్లాయో సీఎం కెసిఆర్ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా 450మంది వరకు దాదాపు 4కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారని, ఈ వసూళ్ల వెనుక మంత్రి జగదీష్‌రెడ్డి ప్రమేయం ఉందంటు ఆరోపించారు. ఆపరేటర్ల పోస్టుల కోసం డబ్బులిచ్చిన వారంతా పేద,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారున్నారని వారికి ఉద్యోగాలు రాకపోయినా, తిరిగి వారికి డబ్బులివ్వకపోయినా వారు రైతుల మాదిరిగా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముందన్నారు. తన నియోజకవర్గంకు చెందిన ఆవుల శంకర్, పాలకూర్తి రమేష్ వంటి సాధారణ కుటుంబాల వారున్నారు.
డబ్బుల వసూళ్ల నిర్వాకంపై సీఎండి ప్రభాకర్‌రావుకు విజిలెన్స్ విచారణ చేపట్టాలని రెండేళ్ల క్రితం లేఖ రాశామన్నారు. జిల్లాలో పనె్నండు స్థానాలు గెలుస్తామన్న మంత్రి జగదీష్‌రెడ్డి ఆపరేటర్ల వద్ధ డబ్బులు వసూలు చేసిన నిర్వాకానికి బాధ్యత వహించాలన్నారు. ఆపరేటర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘన కార్యం మంత్రి జగదీష్‌రెడ్డిదంటు వెంకట్‌రెడ్డి విమర్శించారు. సాగర్-డి 37కాలువ కింద నీళ్లివ్వకుండా కాంగ్రెస్ ఉప సర్పంచ్‌పై టిఆర్‌ఎస్ వర్గాలు దౌర్జన్యం చేశాయంతో అతను ఆత్మహత్య యత్నం చేసుకుని చావుబతుకుల మధ్య ఉన్నాడన్నారు. మూడున్నర ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ వారిని వేధించడం, మాట వినని వారిని హత్యలు చేయడం, కేసులు పెట్టించడం, అమాయకుల వద్ధ డబ్బులు వసూలు చేయడం టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులుగా సాధారణంగా మారిందన్నారు. సబ్ స్టేషన్ల పోస్టుల కోసం ఆపరేటర్ల వద్ధ ఎవరు డబ్బులు తీసుకున్నారో సీఎం కెసిఆర్ విచారణ జరిపించాలన్నారు. సబ్ స్టేషన్ల కోసం భూములిచ్చిన వారికి రెండు పోస్టులిస్తామని చెప్పి ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల మోసాలు, దౌర్జన్యాలపై ఒక్కోక్కటికి వెలికితీసి ప్రజల్లో ఎండగడుతామన్నారు.

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
మేళ్లచెర్వు, ఫిబ్రవరి 22: సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు మండలకేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వయంభువుడైన శివలింగాన్ని శుద్ద సప్తమి అయిన గురువారం ఉదయం వేళలో సూర్య కిరణాలు తాకాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు కుంభరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ అద్భుతం జరుగుతుందని ఆలయ అర్చకులు కె.విష్ణువర్ధన్‌శర్మ తెలిపారు. శివ లింగాన్ని తాకిన సూర్యకిరణాలు దాదాపు 15నిమిషాల పాటు ఉన్నాయని చెప్పారు. సూర్యుడు ఉదయించే సమయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సకల ఆరోగ్య ఆశ్వర్యాలు సిద్దిస్తాయన్నారు.

గంజాయి ఉదంతం
జిల్లాలో సంచలనం
గాయత్రి కళాశాల వసతిగృహంలో 100 కిలోల పట్టివేత
విద్యాలయంలో మాదకద్రవ్య దందాపై కలవరం
కళాశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన విద్యార్థి సంఘాలు
విచారణ చేస్తాం: పోలీసులు
సూర్యాపేట, ఫిబ్రవరి 22: విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన విద్యాలయంలో యువతను మత్తులో ముంచే గంజాయి నిల్వలు పట్టుబడటం చదువుల తల్లికే తలవంపులు తెచ్చింది. రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేకెత్తించిన సూర్యాపేట జిల్లాకేంద్రంలోని శ్రీగాయత్రి జూనియర్ కళాశాల బాలుర వసతిగృహంలో 100 కిలోల గంజాయి పట్టివేత వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈఘటనపై అటు రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారులతో పాటు ఇటు విద్యాశాఖకు చెందిన రాష్టస్థ్రాయి అధికారులు కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఈవ్యవహరానికి సంబంధించి ఇప్పటి వరకు ఏలాంటి వివరాలు తెలియడం లేదని పోలీస్ వర్గాలు చెబుతుండడం, ఇంత భారీ ఎత్తున అక్రమ దందా కొనసాగుతున్నా నిఘా వైఫల్యంపై ఖాకీలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీస్థాయిలో పట్టుబడిన గంజాయిని సూర్యాపేటలోనే అమ్మకానికి తెచ్చారా? ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కళాశాలను స్థావరంగా ఎంచుకున్నారా? ఇందులో కళాశాల యాజమాన్యానికి సంబంధం ఉందా లేదా ప్రచారం జరుగుతున్నట్లుగా వార్డెన్‌కు ప్రమేయం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈసంఘటనకు సంబంధించి పోలీసులు, కళాశాల విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలోని గాయత్రి కళాశాల బాలుర వసతిగృహంలో బుధవారం సాయంత్రం సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి 12 కాటన్లను తెచ్చారు. కారులో వచ్చిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు మరోవ్యక్తి ఉన్నట్లు చెబుతున్నారు. వారు తెచ్చిన కాటన్లను వసతిగృహంలోని విద్యార్ధుల మంచాల కింద దాచి ఉంచారు. అవి పరీక్ష పత్రాలని కళాశాల వార్డెన్ లింగానాయక్ విద్యార్థులకు చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో ప్రత్యేక తరగతులు ముగించుకొని హస్టల్‌లోకి వెళ్లిన విద్యార్ధులు పరీక్ష పత్రాల కోసం దాచిన కాటన్‌లను కత్తిరించి చూడగా అందులో ఆకు కనిపించి వాసన వస్తుండడంలో విద్యార్ధి సంఘాల నాయకులకు సమాచారం అందించగా వారు హస్టల్‌కు చేరుకొని గంజాయిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కళాశాలలో గంజాయి పట్టుబడిన విషయాన్ని తెలుసుకున్న వివిధ విద్యార్ధి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం టీజీవీపీ ఆధ్వర్యంలో గాయత్రి కళాశాలపై దాడిచేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గంజాయి ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వార్డెన్ పట్టుబడితే అన్ని వివరాలు వెల్లడవుతాయని టౌన్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ తెలిపారు.
సూత్రదారులు ఎవరు?
కళాశాలలో పట్టుబడిన గంజాయి దందాకు సూత్రదారులు ఎవ్వరన్నది ఆసక్తి రేపుతోంది. కళాశాల యాజమాన్యం ప్రమేయం లేకుండా జరుగుంతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చత్తీస్‌గడ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి ఖమ్మం జిల్లా పాల్వంచలో సూర్యాపేటకు ఆటోలో తరలిస్తున్న 130 కిలోల గంజాయి పట్టుబడటం ఇందుకు బలం చేకురుస్తుంది. కళాశాలలోదాచిన గంజాయిని ఇక్కడే విక్రయించేందుకు తెచ్చారా, లేదా ఇతర ప్రాంతానికి తరలించేందుకు నిల్వచేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కళాశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్న మహబూబబాద్ జిల్లాకు చెందిన లింగానాయక్ గంజాయి కార్టన్‌లను హస్టల్‌లో పెట్టించినట్లు విద్యార్ధులు చెబుతుండడం ఆయన పరారీలో ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి. లింగానాయక్ సోదరుడు ఈదందా చేస్తుంటాడని అతని కోసమే సహకరించాడని పోలీస్ వర్గాలు ఓకోణంలో అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అన్ని వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి. విచారణ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

4వేలమంది రైతుల ఆత్మహత్య
పల్లెపల్లెకు టీడీపీలో పార్టీ అధ్యక్షుడు రమణ

చిట్యాల, పిబ్రవరి 22: తెలంగాంరాష్ట్రానికి రాబడి దండిగా ఉన్నదని సమైక్యాంద్ర నుండి తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బాద్యతలు స్వీకరించాక రాష్ట్రం ధనికరాష్టమ్రని చెప్పారని, ఇప్పుడు ధనికరాష్టమ్రేమోగానీ రాష్ట్రం మాత్రం అప్పుల తెలంగాణరాష్టమ్రయ్యిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో గురువారం ఎల్. రమణ ముఖ్యఅతిధిగా హాజరైనారు. గ్రామంలో టీడీపీ జెండాను ఎగురవేశారు. పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలతో మాట్లాడారు. ఈసందర్భంగా రమణ మాట్లాడుతూ తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ప్రజాసమస్యలను పట్టించుకునేనాథుడే కరువువైనారని ప్రభుత్వం ప్రజాసమస్యలను అభివృద్ధిని సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనను నిర్వహించే సచివాలయానికి రాకుండా ఘనత సాధించారని 40సార్లు కూడా సచివాలయానికి రాకుండా పరిపాలనను కొనసాగించిన సీఎం దేశంలో ఎవరంటే సీఎం కేసీఆర్ అని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ఫ్రభుత్వాని3కి గుండెకాయ అయిన సచివాలయానికి ఒక ముఖ్యమంత్రి రాకపోవడం ఎంతో అవమానమని సచివాలయం నుండి పరిపాలనను కొనసాగించాల్సిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో కేసీఆర్ ఘనతసాధించారని విమర్శించారు. తెలంగాణరాష్ట్రం ధనిక రాష్టమ్రంటూ ప్రచారార్భాటాలు చేసే సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణరాష్ట్ర పరిపాలన అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్ర ఏర్పడిన సమయంలో రూ. 63వేలకోట్లతో ధనికరాష్ట్రంగా ఉన్న తెలంగాణరాష్ట్రం ప్రస్తుతం రూ. 2లక్షల 20వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఇదేనా ఉన్నతమైన పరిపాలన అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే రైతుల అప్పులుండవని చెప్పారని టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 4000లమంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ఇది ఎంతో బాధాకరమన్నారు. నేషనల్ క్రైమ్‌బ్యూరో నివేధిక ప్రకారం 1600మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పేదప్రజల సమస్యలపై ఉద్యమం చేసే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీయేనని నిరంతరం ప్రజాసమస్యలపై టీడీపీ స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నామన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
మునుగోడు,్ఫబ్రవరి 22: ప్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గ అబివృద్దికి సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక సబ్ మార్కెట్ యార్డులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. ఈనెల 26తేదిన చండూర్ మండలంలో జరిగే భహిరంగసభకు ఐటి శాఖమాత్యులు కెటిఆర్,విద్యుత్‌శాఖ మాత్యులు జగదీశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్‌లు హజరౌతున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజక వర్గానికి తొలిసారిగా వస్తున్న కెటిఆర్‌కు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఘన స్వాగతం పలికి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ బలాన్ని చాటాలన్నారు. ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, యువకులు బారిగా బైక్ ర్యాలీగా తరలిరావాలన్నారు. టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు నర్సింహ్మగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం సత్యం, పిఎసిఎస్ మునుగోడు చైర్మన్ బండా పురుషోత్తంరెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు లాల్‌బహుదూర్‌గౌడ్, పులిపలుపుల ఎంపిటిసి నకరకంటి స్వామిగౌడ్, వివిద గ్రామాల సర్పంచులు ఆకుల వెంకన్న, దొడ్డి యాదగిరి, ఐతగోని బుచ్చయ్య,కంభంపాటి వెంకటయ్య, ముప్ప రవిందర్‌రెడ్డి, యువజన నాయకులు కందుల రాజుగౌడ్ పాల్గొన్నారు.

వృత్తివిద్యలోనూ నైపుణ్యం సాధించాలి
విద్యార్థులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి పిలుపు
రామగిరి, ఫిబ్రవరి 22: విద్యార్థులు వృత్తి విద్యా రంగంలో సైతం నైపుణ్యం సాధించాలని, భవిష్యత్‌లో కుటుంబానికి అదే ఆధారం కావచ్చని సీఎల్పీ ఉప నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రతీక్‌రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ వృత్తివిద్య కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో 350 మంది విద్యార్థులుండగా..నేడు 1200 మంది విద్యార్థులతో వృత్తివిద్య కళాశాల విరాజిల్లుతుందన్నారు. పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రభుత్వ ప్రోత్సాహకంతో పాటు తన వంతుగా 50వేల రూపాయలను బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. వృత్తివిద్య కోర్సులో నాలుగు సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు కుటుంబంతో సంతోషంగా గడవవచ్చన్న విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలన్నారు. అనంతరం కమర్షియల్ గార్మెట్ టెక్స్‌టైల్ మేకింగ్ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కె.వీణారెడ్డి సత్యపాల్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా వారి సేవలను కొనియాడి పూలమాలలు, శాలువాలతో దంపతులను ఘనంగా సన్మానించారు. పదవీ విరమణతో ఆనందం అనిపించినా బాధ్యత పెరిగిందని గుర్తించాలని, కాంట్రాక్ట్ లెక్చరర్‌గా 30 సంవత్సరాలు పని చేసి పదవీ విరమణ పొందడం బాధగా ఉందన్నారు. అనంతరం పలు రంగాల్లో ప్రావీణ్యం కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు.

రైతు శ్రేయస్సే లక్ష్యం
ఎమ్మెల్యే రవీంద్రకుమార్
చింతపల్లి, ఫిబ్రవరి 22: రైతు సంక్షేమం కోసం టీఆర్‌యస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని వర్కాల గ్రామంలో మిషన్ కాకతీయ పథకం కింద 28.23లక్షల వ్యయంతో చేపట్టే మొండికత్వకుంట పునర్ నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను అభివృద్ధిపరిచి తద్వారా బీడు భూములను సాగులోకి తీసుకరావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద రైతులకు ప్రభుత్వమే పంట సాగుకు ఆర్థిక సహాయం అందించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. తొలుత పీకే.మల్లేపల్లిలోని హజరత్ అబ్బాస్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
న్యాయం చేయాలి
కలెక్టరేట్ ఎదుట రైతు బంధువుల ధర్నా
బాధితుడిని పరామర్శించిన సీఎల్పీ నేత జానారెడ్డి
మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలింపు
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 22: మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామ రైతు బోడ యాదయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతుండటంతో బాధిత కుటుంబానికి న్యాయం చేసి, ఆత్మహత్యాయత్నానికి పురిగొల్పిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ యాదయ్య బంధువులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల పొలాలకు వెళ్లే నీటిని దారి మళ్లిస్తున్న వారిని వారించినందుకు గ్రామానికి చెందిన కొంత మంది బోడ యాదయ్యపై బెదిరింపులకు దిగారని, ఇదే విషయమై అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని యాదయ్య బంధువులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ కూడా అయిన యాదయ్యకే ఇలాంటి పరిస్థితి దాపురిస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాదయ్యను సీఎల్పీ నేత జానారెడ్డి పరామర్శించారు. బాధిత బంధువుల కోరిక మేరకు హైద్రాబాద్ ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం యాదయ్యను తరలించారు.

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
ఇంటర్ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు బోర్డు డైరెక్టర్ అశోక్ ఆదేశం
రామగిరి, ఫిబ్రవరి 22: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్, కమిషనర్ డి.అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం హైద్రాబాద్ నుండి వివిధ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుండి మార్చి 19 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్ష హాల్‌లోకి ప్రవేశించిన విద్యార్థులను పరీక్ష పూర్తయ్యేంత వరకు బయటకు పంపించవద్దన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నెట్ నుండి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్షకు పావుగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతివ్వరాదని సూచించారు. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని, ఆ సమయంలో జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు.
జేసీ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని, మొదటి సంవత్సరం 16,879 మంది, రెండవ సంవత్సరం 18,119 మంది మొత్తం 34,998 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు 50 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 50 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 9 మంది కస్టోడియన్ అధికారులు, ఇద్దరు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, నాలుగు సిట్టింగ్ స్వ్కాడ్స్ టీంలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఆర్టీసీ 18 రూట్లలో బస్సులు నడపనున్నట్లు తెలిపారు. జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ, హైపవర్ కమిటీలను ఏర్పాటుచేసి సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎగ్జామినేషన్ కంట్రోలర్ సుశీల్‌కుమార్, జిల్లా నుండి ఎస్పీ శ్రీనివాసరావు, డీఐఈవో హన్మంతరావు, డీఈవో సరోజిని తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలి
పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నాలు

హుజూర్‌నగర్, ఫిబ్రవరి 22 : ఉపాద్యాయ, ఉద్యోగుల, పెనె్షనర్‌లకు నష్టం కలిగిస్తున్న నూతన కాంట్రూబ్యూటరీ పెనె్షన్ ( సిపియస్) విధానాన్ని రాష్ట్రప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రాష్ట్ర పిఆర్‌టియు పిలుపు మేరకు ఈ ధర్నాను ఉపాధ్యాయులు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించగా ఇందులో ఉద్యోగులు, పెనె్షనర్‌లు కూడా పాల్గొని మద్దతు ప్రకటించారు. 2005 నుండి అమలులోకి తెచ్చిన సిపియస్ విధానం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కూడా ముందుండాలని వక్తలు అన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్టప్రతి ఆమోద ముద్ర వేసినందున ప్రభుత్వం వెంటనే ప్రమోషన్‌లు, బదిలీలకు షెడ్యూల్ ప్రకటించాలని కోరారు.
చౌటుప్పల్‌లో..
చౌటుప్పల్: నూతన పెన్షన్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు వై.రవీందర్ మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతకు పెను ప్రమాదంగా మారిన నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
మునగాలలో..
మునగాల: సీపీఎస్ విధానాన్ని రద్ధుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో తహశీల్ధార్ కార్యాలయంలో ధర్నా చేశారు. ఈసందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్‌రూల్స్‌తో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరం కోసం సంఘం ఆధ్వర్యంలో కార్యచరనను రూపొందిస్తున్నామన్నారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయకపోతే జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మిర్యాలగూడ లో..
మిర్యాలగూడ టౌన్: సీపీఏస్‌ను రద్దు చేయాలని, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని కోరుతూ పీఆర్‌టీయుటీఏస్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీపీఏస్ 2004 నుండి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. నూతన కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై కోర్టులో ఉన్న స్టేను వెకేట్ చేయించి ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, కేజీవీబీ, ఆదర్శస్కూల్స్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, పీఈటీలకు అప్‌గ్రేడేషన్ చేయాలని కోరారు. వారి ఆందోళనకు టీపీసీసీ కార్యదర్శి డీ.స్కైలాబ్‌నాయక్, దామరచర్ల జడ్పీటీసీ కే.శంకర్‌నాయక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏండీ.యూసుఫ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సాధినేని శ్రీనివాస్‌రావు, సీఐటీయు పట్టణ అధ్యక్షుడు డాక్టర్ గౌతంరెడ్డి, బహుజన నాయకులు డాక్టర్ జే.రాజు, టీఆర్‌ఏస్ నాయకులు గాయం ఉపేందర్‌రెడ్డి, జి.దుర్గాప్రసాద్, ఏంపీపీ ఒగ్గు జానయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత రామానుజాచార్యులులు మద్దతు తెలిపారు.
పాలకీడులో..
పాలకీడు: మండల కేంద్రంలో సీపీఎస్, ఏకీకృత సర్వీస్‌రూల్స్, 398ఇంక్రీమెంట్స్‌కై తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం ఒక్కరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మొదట ఉపాధ్యాయులు భారీ ర్యాలీగా తరలివచ్చి ధర్నా శిబిరానికి చేరుకున్నారు. ధర్నాలో పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొణతం వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. మండల పీఆర్‌టీయూ ధర్నా పరిశీలకులు నాయిని వెంకటయ్య ఆధ్వర్యంలో పాలకీడు మండలం పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్షులు బొడ్డు సైదులు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొడ్డు సైదులు, ప్రగఢ శేఖర్‌లు ఉపాధ్యాయుల సీపీఎస్ రద్దు, పరిష్కారం కాని సమస్యలపై సూర్యాపేట జేసీ సంజీవరెడ్డికి, మండల తహసీల్దార్ పద్మావతి వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నానుద్దేశించి జేసీ సంజీవరెడ్డి మాట్లాడుతూ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామి ఇచ్చారు.
అడవీదేవులపల్లిలో..
అడవీదేవులపల్లి: అడవీదేవులపల్లి మండల కేంద్రంలో గురువారం పీఆర్‌టీయుటీఎస్ అడవీదేవులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకై ధర్నా కార్యక్రమం జరిగింది. పీఆర్‌టీయుటీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు ఏకీకృత సర్వీస్ సాధన పెండింగ్‌లో ఉన్న వివిధ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దామరచర్ల మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి, రాష్ట్ర కార్యదర్శి గోపి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చారి, ప్రధానోపాధ్యాయులు సబియుద్ధీన్‌లు సంఘీభావం తెలిపారు.
మునుగోడులో..
మునుగోడు: ఉపాధ్యాయుల పొట్టగొడుతున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పిఆర్‌టియు మండల కమిటి ఆద్వర్యంలో మండల కేంద్రంలోని తహశీల్ధార్ కార్యాలయం వద్ద గురువారం దర్నా నిర్వహించారు. ఈసందర్బంగా పిఆర్‌టియు మండల అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్‌పాషా మాట్లాడుతూ 398ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు.అనంతరం తహశీల్ధార్ ప్రమిలకు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ దర్నా కు స్థానిక ఎం ఈవో నర్సింహ్మ హజరై మద్దతూ తెలిపారు.
సీపీయస్ వద్దు.. ఓపీయస్ ముద్దు
చండూరు,: సీపీయస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానానే్న కొనసాగించాలని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గురువారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పీఆర్‌టీయూ అధ్యక్షులు సుంకరి బిక్షం, ఎంపీడీవో శైలజ, ఎంఈవో రవీందర్ పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై
ఖాళీ బిందెలతో ధర్నా
అడవీదేవులపల్లి, ఫిబ్రవరి 22: మండలంలోని కొత్తనందికొండ గ్రామంలో ఉన్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని గ్రామ మహిళలు గురువారం నాడు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. సీపీఎం ఇంటింటి కార్యక్రమంలో మండల కార్యదర్శి జటంగి సైదులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఎన్ని సార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చిన గానీ పట్టించుకోవడం లేదని తెలియడంతో ఆందోళనకు దిగారు. అదే విధంగా మురికికాల్వల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. 7,8వార్డులలో త్రాగునీటి సమస్య గ్రామంలో నీటి కోసం అల్లాడుతున్నారన్నారు. 24గంటల కరెంట్‌తో అడుగంటుతున్న భూగర్భజలాలు తాగు నీటి కోసం ప్రజలు నానాకష్టాలు పడాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరధ పనులు 90శాతం పూర్తి అయ్యాయని అధికారులు చెప్తున్నప్పటికి 30శాతం పనులు కూడా పూర్తీ కాలేదన్నారు. మార్చి 25నాటికి పనులు పూర్తీ చేసి ఏప్రిల్ నెలలో పైపు లైన్ల ద్వారా ఇంటింటికి నీరందించాలని అధికారులు కసరత్తు చేస్తున్న పూర్తీ అవుతుందన్న నమ్మకం లేదని ప్రజలు భావిస్తున్నారన్నారు. వేసవి కాలంలో ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కుర్రా శివనాయక్, దేవతల సైదయ్య, రంగా, హనుమంతు, శ్రీను, కవిత, లక్ష్మీ, బుజ్జీ, సైదిలు పాల్గొన్నారు.

ఇది పరీక్షా సమయం
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఉత్తీర్ణతా శాతం పెంచాలి
ఉపాధ్యాయులకు సూచించిన కలెక్టర్ సురేంద్రమోహన్

సూర్యాపేట, ఫిబ్రవరి 22: వచ్చే నెలలో జిల్లాలో నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్భందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ కోరారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పదవ తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామాని అందులో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 62 కేంద్రాల్లో 13,443 మంది, 14 ప్రైవేట్ కేంద్రాల్లో 2870 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 2వతేదీ వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధుల సౌకర్యార్ధం త్రాగునీరు, వైద్యశిబిరాలను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. పోలీస్ బందోబస్తుతో రూట్ మాప్ ద్వారా అన్ని పరీక్ష కేంద్రాలకు అనుకున్న సమయానికి ప్రశ్న పత్రాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజు వారిగా పరీక్షల నిర్వాహన అనంతరం సెట్, వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జీరాక్స్ సెంటర్‌లను మూసీ వేయించాలని స్పష్టంచేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇబ్బందులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల సందర్భంగా విద్యార్ధులు ఏలాంటి ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణాన్ని కల్పించాలని కోరారు. పరీక్షలకు హజరైయ్యే విద్యార్దుల కోసం అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపించాలని కోరారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
జిల్లాలో పరిశ్రమల స్ధాపనకు ముందుకు వ వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలశాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, విద్యుత్‌శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 2017- 18 సంవత్సరానికి గాను 10 మంది ఎ