నల్గొండ

ఎన్నికల కమిషన్ నియమావళి పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలింగ్ నిర్వాహణ శిక్షణలో కలెక్టర్
నల్లగొండ, డిసెంబర్ 18: స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమావళిని అన్ని పార్టీలు, అభ్యర్థులు విధిగా పాటించాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శుక్రవారం కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ఐదు డివిజన్ కేంద్రాల్లో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో 1110మంది ఓటర్లు మాత్రమే పాల్గొంటారన్న నిర్లక్ష్యంతో ఉండరాదన్నారు. పోలింగ్ ఉదయం 8నుండి సాయంత్రం 4గంటల వరకు సాగుతున్నందునా విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలని ఓటర్ ఓటు వేసి బయటకు వెళ్లే వరకు పర్యవేక్షించాలని, ఇతరులను ఎవరిని పోలింగ్ కేంద్రాలకు అనుమతించరాదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు వెబ్ కెమెరాలతో లోపల, బయట పోలింగ్ ప్రక్రియ తీరును చిత్రీకరిస్తాయన్నారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలన్నారు. నిరక్షరాస్యులైన ఓటర్లకు సహాయకుడిని ఏర్పాటు చేసాత్మని ఇందుకోసం పోలింగ్కు మూడు రోజుల ముందు ఓటర్ రఖాస్తు చేసుకోవాల్సివుంటుందన్నారు. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్స్‌లను సరిచుసుకుని ఉదయం 7-30కు ఏజెంట్ల సమక్షంలో అన్ని పరిశీలన పనులు పూర్తి చేసి పోలింగ్ సమయానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్‌లను జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయానికి తరలించి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచే వరకు బాధ్యత పోలింగ్ అధికారుపై ఉంటుందన్నారు. ఎన్నికల అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నామన్న అంశాన్ని గుర్తెరిగి మసలుకోవాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల సిబ్బణంది పోలింగ్ నిర్వాహణ తీరుపై డిఆర్‌డిఏ పిడి అంజయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు అవగాహాన కల్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట్రావు, డిఆర్‌వో రవినాయక్, శ్యాంసుందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.