నల్గొండ

ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల భిక్షాటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జనవరి 21: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గురువారం ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బరిగెల వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్ధుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లపై ఆధారపడి విద్యనభ్యసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థు లను ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పండుగలు, గుళ్లు, గోపురాలు, పుష్కరాలు, యాగాల మీద ఉన్న ప్రేమ విద్యార్ధులపై లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు ముదిగొండ మురళికృష్ణ, జమీర్, సాగర్, బాలరాజు, లింగస్వామి పాల్గొన్నారు.గ్రామీణుల్లో సేవాభావాన్ని పెంపొందించాలి
రామన్నపేట, జనవరి 21: గ్రామీణ ప్రజలలో సేవాభావాన్ని పెంపొందించడానికి ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు కృషిచేయాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కోరారు. మండలంలోని జనంపల్లి గ్రామంలో నలందా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శీతాకాలం సేవాశిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలపై ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు చర్చించి, సేవాకార్యక్రమాలను రూపొందించుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, విద్యావంతుల సహకారంతో వారం రోజులలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామంలో పారిశుద్ద్యం, ప్రజారోగ్యం, తాగునీరు వంటి అంశాలపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకరావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపిపి కక్కిరేణి ఎల్లమ్మవిజయ్, జడ్పీటిసి జినుకల వసంతాప్రభాకర్, ఎంపిడివో జానకిరెడ్డి, సర్పంచ్ పోచబోయిన మల్లేషం, ఎంపిటిసి బండ పద్మాదామోదర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఐతరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.