నల్గొండ

హెల్మెట్‌తో క్షేమంగా ప్రయాణించండి: డిఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, డిసెంబర్ 8: హెల్మెట్ ధరించి ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా ప్రయాణించండి అంటు మంగళవారం భువనగిరి పోలీసులు హెల్మెట్లు ధరించి పట్టణంలో అవగాహన ర్యాలి నిర్వహించారు. భువనగిరి డిఎస్పీ సాదు మోహన్‌రెడ్డి ర్యాలికి జండా ఊపి ప్రారంభించిన అనంతరం డిఎస్పీ విలేఖరులతో మాట్లాడుతు హెల్మెట్‌ను ఇష్టంగా ధరించడం అలవాటు చేసుకోవాలని అనుకోని ప్రమాదాలలో హెల్మెట్ ప్రాణాపాయ పరిస్థితులనుండి తప్పిస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో భువనగిరి సిఐలు మాదాసు శంకర్‌గౌడ్, తిరుపతి, ఎస్సైలు హన్మంత్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.