నల్గొండ

కిక్కిచ్చే కల్లు.. నేటినుండి నిల్లు కల్తీకల్లు విక్రయకేంద్రాల సీజ్ శ నిర్వాహకునిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జనవరి 21: ఎక్సైజ్ సూపరింటెండెంట్ దత్తరాజ్‌గౌడ్ ఉత్తర్వులమేరకు గురువారం భువనగిరిలో కల్తీకల్లు విక్రయిస్తున్న శ్రీలక్ష్మినరసింహ గీతాపారిశ్రామిక సహకార సంఘం లైసెన్స్‌ను రద్దుచేస్తు 8కల్లువిక్రయశాలలను సీజ్ చేసినట్లుగా భువనగిరి ఎక్సైజ్ సర్కిల్ ఇన్సిపెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ గీతాపారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో విక్రయిస్తున్న కల్లులో నిషేధిత అప్రోజోలం మత్తుపదార్థం మితిమీరిన మోతాదులో కలిపినట్లుగా ఫోరెనిక్స్ పరీక్షలలో వెల్లడైందని అన్నారు. జనవరి 6వతేదిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సురేష్ రాథోడ్ ఆధ్వర్యంలో భువనగిరి కల్లువిక్రయశాలలలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి కల్లు నమూనాలను సేకరించి హైద్రాబాద్ ఫోరెనిక్స్ సైన్స్‌ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపినట్లుగా తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులలో నిషేధిత అప్రోజోలం మత్తుపదార్ధం అధిక మోతాదులో ఉన్నట్లుగా నివేదికలు రావడంతో కల్తీకల్లు విక్రయశాలలను మూసివేసామన్నారు. ఆప్రోజోలం మత్తుపదార్థం అలవాటైన కల్లుప్రియులకు కల్లువిక్రయకేంద్రాల సీజ్ శరాఘాతంగా మారింది. 25రూపాయలకే కావల్సినంత కిక్కునిచ్చే కల్లుసీసా దొరక్కపోవడంతో కల్లుప్రియులు పిచ్చెక్కిపోతున్నారు. రోజూ అలవాటైన కల్లుసీసా ఇచ్చే కిక్కు ఛీప్ లిక్కర్ ఇవ్వదని ఎంచేయాలో తోచట్లేదని కల్లుప్రియులు వాపోతున్నారు. రోజువారీ అలవాటయిన కల్తీకల్లు దొరక్క వారిలో విపరీతపోకడలు కన్పిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందస్తుగా ఏరియా ఆసుపత్రి డాక్టర్లకు తెలియజేసినట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నిర్వాహకుడు జడల జనార్ధన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా సిఐ వెంకట్‌రెడ్డి తెలియజేసారు. కల్లు విక్రయశాలలను సీజ్ చేసిన వారిలో భువనగిరి ఎక్సైజ్ సబ్ ఇన్సిపెక్టర్ క్రిష్ణ, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీలక్ష్మినరసింహస్వామి కల్లు గీతాపారిశ్రామిక సహకార సంఘం 1982లో స్థాపించి కల్లును విక్రయిస్తున్నామని నేటివరకు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని నిర్వాహకులు తెలియజేసారు. కల్లు విక్రయకేంద్రాలను సీజ్ చేయడంతో కల్లుగీత కార్మికుల ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.