నల్గొండ

పరిహారం ఎప్పుడో?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 25: తీవ్ర కరవు పరిస్థితులతో పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యల పర్వంలో సాగిపోతున్న రైతాంగానికి పంట నష్టపరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) ఆసరాగా అందుతుందనుకుంటే కేంద్రం జాప్యంతో రైతులు పరిహారం కోసం ఎదురుచూపులు పడుతున్నారు. కరువు మండలాల శాస్ర్తియ గుర్తింపులో భాగంగా జిల్లాలో గత ఖరీఫ్‌లో వర్షాభావంతో 22మండలాలు కరువు బారిన పడగా 1లక్ష 25వేల 109హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. 1లక్ష 59వేల 863మంది రైతులకు 86కోట్ల 68లక్షల 39వేల పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 231మండలాలను కరువు మండలాలుగా గుర్తించిన ప్రభుత్వం కేంద్రానికి 989.15కోట్ల పరిహారం కోరుతు ప్రతిపాదనలు సమర్పించింది. కేంద్ర కరువు బృందాలు సైతం జిల్లాలో మూడున్నర నెలల క్రితమే పర్యటించి కరువు తీవ్రతను గుర్తించి సహాయం కోసం కేంద్రానికి నివేదికలు సమర్పించాయి. మూడు నెలలు కావస్తున్న కేంద్రం నుండి ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు ఊసు లేకపోవడం రైతులను కలవరపరుస్తుంది. జిల్లాలో చింతపల్లి, చందంపేట, డిండి, మేళ్లచెర్వు, దేవరకొండ, నారాయణపూర్, తిప్పర్తి, కనగల్, చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, మోత్కూర్, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, మోతే, నకిరేకల్, మఠంపల్లి, తుర్కపల్లి, బొమ్మలరామారం, యాదగిరిగట్ట మండలాలు కరవు బారిన పడినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువగా పత్తి, కంది, వరి పంటలు వర్షాభావంతో దెబ్బతిన్నాయి. 1,43,879మంది పత్తి రైతులకు చెందిన 1లక్ష 19,386హెక్టార్ల పత్తి పంటలు దెబ్బతినగా 81ట్ల 18లక్షల నష్టం వాటిల్లినట్లుగా లెక్కకట్టారు. 5,899మందికి చెందిన 2533హెక్టార్ల కంది, 6,921మంది రైతులకు చెందిన 2293హెక్టార్ల వరి పంటలు దెబ్బతిన్నాయి.
పరిహారం కోసం పరేషాన్ !
కరువుతో పంటలు దెబ్బతిన్న రైతులకు కేంద్రం నుండి నేటి వరకు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు కాకపోవడంతో పరిహారం నిధుల మంజూరు ఎప్పుడా అని రైతాంగం ఎదురుచూస్తోంది. పంట నష్టపరిహారం కోసం రైతులు రాష్ట్ర ప్రభుత్వం వైపు, రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంవైపు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. పంటలు దెబ్బతిని పెట్టుబడులు సైతం నష్టపోయి అప్పులు పెరిగి ఆర్థికంగా తిప్పలు పడుతున్న తమకు ఇన్‌పుట్ సబ్సిడీ అందితే కొంత వరకైనా ఊరట దక్కేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే రబీ సీజన్‌లో కేవలం 79,455హెక్టార్లలో, సాధారణంగా 45శాతం పంటల సాగు మాత్రమే జరిగింది. వర్షాలు లేక భూగర్భ జలాలు సైతం అడుగంటిపోవడం, రుణమాఫీ దఫాల వాయిదాతో సకాలంలో బ్యాంకర్ల నుండి పంట రుణాలు సైతం అందకపోవడం వంటి అనేక సమస్యలతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పటికే జిల్లాలో 380మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా ప్రభుత్వం 79మందికి లక్షన్నర చొప్పున పరిహారం అందించింది. కనీసం పంట నష్టపరిహారమైన చేతికందితే రానున్న ఖరీఫ్ సీజన్‌ల పంటల సాగుకు ఎంతోకొంత ఆర్ధికంగా అవసరపడేదని రైతులు భావిస్తున్నారు. కాగా గతంలో సైతం 2013-14సంవత్సరంలో సైతం కేంద్రం ప్రభుత్వ నుండి రాష్ట్రానికి ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో మంజూరుకాని సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం 480కోట్ల సబ్సిడీని అందించి రైతులను ఆదుకుంది. ఈదఫా కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే పంట నష్టపరిహారాన్ని చెల్లించి కరువు పీడిత రైతాంగాన్ని ఆదుకోవాలని రైతన్నలు ఆశిస్తున్నారు.