నల్గొండ

ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌రావు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, నవంబర్ 3 : ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై భారీ నీటిపారుదల శాఖామంత్రి టి.హరీష్‌రావు గురువారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల భూసేకరణ ముమ్మరం చేయలని, సివిల్ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సాగర్ లో లెవల్ కెనాల్ పనులు పూర్తి అయినందున త్వరలో ప్రారంభిస్తామన్నారు. జిల్లాలోని ఎస్ ఆర్ ఎస్పీ కాలువల పరిధిలోని చెరువులకు నీరు అందిస్తున్నామని ఏఎంఆర్‌పి కాలువల కింద చెరువులను కూడా నింపుతున్నామన్నారు. ఏ ఎం ఆర్‌పి సొరంగం పనులు, పెండ్లిపాకల, నక్కలగండి రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలన్నారు. మిషన్ కాకతీయ అసంపూర్తి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసి నారాయణరెడ్డి, డిఆర్‌ఒ అంజయ్య, ఐబి ఎస్ ఈ ధర్మానాయక్, ఈఈ హమీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.