నల్గొండ

నైపుణ్య శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 6: అధికారులు నైపుణ్య శిక్షణలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ సలహాదారు ఎ.రామలక్ష్మణ్ అధికారులకు సూచించారు. ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్‌ను సందర్శించిన ఆయన సంక్షేమ కార్యక్రమాల అమలును శాఖల వారీగా సమీక్షించారు. 2015-16లో మంజూరు చేసిన అన్ని యూనిట్లను ఈనెలాఖరు లోగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. గ్రౌండింగ్ ప్రక్రియను బ్యాంకర్లకు వదిలిపెట్టవద్దని ప్రతి యూనిట్‌ను స్వయంగా తనిఖీచేసి ఆన్‌లైన్‌లో ఫోటోలతో పంపాలన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పేద కుటుంబాలకు అవగాహన కల్పించాలన్నారు. విదేశీ విద్యా ప్రోత్సహాకాలు, ఆర్దిక సహాయ పథకాల గురించి విసృతస్థాయిలో ప్రచారం చేయాలన్నారు. 2016-17సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి ఆర్ధిక సహాయం పథకాల నిబంధనలు, నిధులను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్‌లు మంజూరీ చేయాలని, ఆర్ధిక చేయూతనిచ్చే నైపుణ్య శిక్షణకు అనువైన రంగాలను గుర్తించాలన్నారు. పేదల జీవితాల్లో శాశ్వంతంగా మార్పు వచ్చేందుకు యూనిట్ల విలువను, రాయితీని ప్రభుత్వం గణనీయంగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ బి. సంజీవరెడ్డి, డిఆర్‌వో గోపాల్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.