నల్గొండ

మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, నవంబర్ 7: మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటుచేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటుచేయుటకు అన్నిరకాల భౌగోళిక వసతులు కలిగి ఉందని, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ నియోజకవర్గాలను కలిపి మిర్యాలగూడను జిల్లాగా చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మానవనిర్మిత జలాశయం నాగార్జునసాగర్, ఆసియా ఖండంలోనే అత్యధికంగా రైస్‌మిల్లులు ఉన్న మిర్యాలగూడ, భారతదేశంలో అత్యధికంగా సిమెంట్ కర్మాగారాలు ఉన్నా హుజూర్‌నగర్ ప్రాంతంలో రైల్వే సౌకర్యం కలిగి ఉన్నందున మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటుచేయాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈకార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు డి.్ధనుంజయనాయుడు, బెల్లంకొండ గోవింద్, పాల్గొన్నారు.
రైతు రుణమాఫీని వెంటనే ప్రకటించాలి
చండూరు, నవంబర్ 7: రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రావిరాల శ్రీను ఆధ్వర్యంలో తహశీల్ధార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతు రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయాలని, రుణాలను రెన్యువల్ చేయాలని, రైతులకు కరువు సహాయం ప్రకటించాలని, దళితులందరికీ మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తహశీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు.