నల్గొండ

టోల్ రద్దయనా.. ఆర్టీసీ బాదుడే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 14: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న చిల్లర కష్టాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రహదారులపై టోల్ రుసుమును రద్దుచేసింది. అయిన ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికుల నుండి టోల్ చార్జీలను యధావిధిగా వసూళ్లు చేస్తున్నారు. ఈనెల 9న ప్రధానమంత్రి మోదీ రూ.500, రూ.1000నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పెద్దనోట్లను మార్చుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్‌గేట్ల వద్ద చిల్లర సమస్యలు ఉత్పన్నం కావడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఇక్కట్లను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఈనెల 10నుండి 14వ తేదీ అర్దరాత్రి వరకు దేశవ్యాప్తంగా టోల్‌గేట్ చార్జీలను రద్దుచేసింది. అప్పటి నుండి ఆర్టీసీ బస్సులన్ని టోల్‌గేట్ల వద్ద ఎలాంటి సుంకం లేకుండానే రాకపోకలు సాగిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నుండి హైదరాబాద్, నల్లగొండకు వెళ్లేందుకు 65వ నెంబర్ జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దులోని కేతెపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద టోల్‌ఫ్లాజా మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ టోల్ రుసుము కింద ప్రతి ప్రయాణికుని వద్ద నుండి రూ. 5 టోల్ చార్జీగా వసూళ్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం టోల్ రుసుము ఎత్తివేసిన ఆర్టీసీ యాజమాన్యం తమ వద్ద నుండి చార్జీలు వసూళ్లు చేయడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట డిపో నుండి నల్లగొండకు ఎక్స్‌ప్రెస్ ఆర్డీనరి బస్సులు ప్రతినిత్యం 80ట్రిప్పులు, సూర్యాపేట నుండి హైదరాబాద్‌కు 45ట్రిప్పులు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున నిత్యం సుమా రు 5వేల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వీరందరిపై రూ.5టోల్ రుసు ము రూపంలో భారం పడుతోంది. సూర్యాపేట డిపోతో పాటు హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం తదితర ప్రాంతాలకు నడుస్తున్న ఇతర డిపో బస్సుల్లోను ఇదే రీతిన టోల్ రుసుములు వసూళ్లు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ టోల్ రుసుము చెల్లించకుండానే తమ వద్ద చార్జీలు వసూళ్లు చేయడం దారుణమని పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై సూర్యాపేట డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ నెలరోజుల ముందుగానే టోల్‌ఫ్లాజా నిర్వాహకులకు తాము డబ్బులు చెల్లించి టోల్ పాస్‌లు తీసుకుంటామని అందువల్లే టిక్కెట్‌పై చార్జీలు వసూళ్లు చేయాల్సి వస్తుందని చెప్పారు.