నల్గొండ

మహిళా భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, నవంబర్ 15: మహిళలు, విద్యార్ధినుల భద్రతకు సీఎం కెసిఆర్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి షీట్‌మ్స్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దేశ్‌ముఖి గ్రామంలో సెయింట్ మేరిస్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్ధినిల సమావేశంలో పోలీస్ శాఖ షీటీమ్స్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు విద్యార్ధినులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈవ్‌టిజింగ్ వంటి వాటికి పాల్పడి యువత తమ భవిష్యత్ చెడగొట్టుకోవద్ధన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, రాచకొండ సిసి మహేష్‌భగవత్, డిసిపి పి.యాదగిరి, ఏసిపి సాధుమోహన్‌రెడ్డి, సిఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ రాఘవేంద్రగౌడ్, జడ్పీటీసి మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ రాజుయాదవ్, ఎంపిటీసి కాసర్ల జంగయ్య, కళాశాల యాజమాన్యం కెవికె రావు, నాయకులు జంగయ్య, వెంకటేశం, రావుల శేఖర్‌రెడ్డి, కందాటి భూపాల్‌రెడ్డి, తోట మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.