నల్గొండ

కట్నం వేధింపులతో మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతెపల్లి, నవంబర్ 20: అత్తింటి వేధింపులు, భర్త చిత్రహింసలు తట్టుకోలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాధ సంఘటన మండలంలోని ఇనుపాముల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం తండు కళ్యాణి(23)ని మిర్యాలగూడ పట్టణానికి చెందిన గుణగంటి ప్రమీళ మల్లయ్య కుమారుడు అయిన వేణుతో సంవత్సరం క్రితం వివాహం చేశారు. వేణు వృత్తిరిత్య ఆటో డ్రైవర్ కాగా వివాహ సమయంలో వేణుకు లక్షా 10వేలు, 60గ్రాముల బంగారం కట్నంగా ఇవ్వడం జరిగింది. వివాహం జరిగిన రెండు నెలల నుంచి వేణు అధనపుకళ్యాణిని అధనపుకట్నం తేవాలని, లేకపోతే విడాకులు ఇస్తే వేరే వివాహం చేసుకుంటానని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో కళ్యాణి భర్త వేణు, అతని కుటుంబసభ్యులపై కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వేణు కుటుంబీకులు కళ్యాణి కుటుంబీకులతో రాజీచేసుకోగా రెండు నెలల క్రితం కళ్యాణిని అత్తవారు తమ ఇంటికి తీసుకెళ్లారు.
అనంతరం కళ్యాణిని ఒక నెల నుండి వేణు అమ్మ, చిన్నమ్మ, అక్కలు అయిన ప్రమీళ, పద్మ, ఉమ, సరితలు తీవ్ర వేధింపులకు గురిచేయగా ఈనెల 13న తన స్వగ్రామమైన ఇనుపాములకు వచ్చింది. శనివారం ఉదయం వేణు కళ్యాణికి ఫోన్‌చేసి అధనపు కట్నం తేవాలని, లేని పక్షంలో వేరే వివాహం చేసుకుంటానని చెప్పగా తీవ్ర మనస్థాపానికి గురై శనివారం రాత్రి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స నిమిత్తం కళ్యాణిని నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం నల్లగొండ తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నల్లగొండ డిఎస్పి ఎస్.సుధాకర్, శాలిగౌరారం సిఐ విశ్వప్రసాద్, తహశీల్దార్ వి. హనుమాన్‌నాయక్, మృతురాలి కుటుంబసభ్యులు, గ్రామస్తుల నుండి వివరాలు సేకరించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.కిష్ణయ్య తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సంఘటన గురించి తెలుసుకొని మృతదేహం ఉన్న నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కళ్యాణి మృతదేహానికి నివాళ్లర్పించారు. కళ్యాణి తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. నింధితులను కఠిన శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని మృతురాలి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.
ఇది రెండవ వరకట్న ఆత్మహత్య
గత వారంరోజులుగా మండలంలో వరుసగా అధనపు వరకట్నం వేధింపులతో ఇద్దరు వివాహితలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెల 14న ఖమ్మంపాటి సులోచన ఆత్మహత్య చేసుకోగా నేడు గునగంటి కళ్యాణి ఆత్మహత్యతో వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకోవడం మండలంలో రెండవది కావడంతో మండలంలో విషాయదచాయలు అలుముకున్నాయి. వరకట్న వేధింపులకు గురిచేస్తున్న నింధితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలతో పాటు వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు.