నల్గొండ

మహా విజయచండీ హోమంలో మాజీ గవర్నర్ రోశయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, నవంబర్ 20: కార్తీకమాసం పురస్కరించుకుని ప్రణవ సంస్థ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం ఆద్వర్యంలో భువనగిరిలో నిర్వహిస్తున్న మహ విజయచండీ హోమంలో ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పాల్గొన్నారు. ఆదివారం హోమం ముగింపు కార్యక్రమంలో బాగంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలోరోశయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు కార్తిక మాసంలో వనబోజనాల విశిష్టతను తెలిసేలా కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. అటు యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ్మస్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధితో ఆద్యాత్మికంగా, ఇటు పారిశ్రామికకేంద్రమైన భువనగిరి సాంకేతికంగా అభివృద్దిచెందె అవకాశం ఉందన్నారు. ప్రణవ సంస్థవారు హౌజింగ్‌కాలనీలో పూర్తి సౌకర్యాలను కల్పించాలని సూచించారు. విదేశి మహిళలు సాంప్రదాయ దుస్తులతో రోశయ్యకు స్వాగతం పలుకగా, వెంకటేశ్వర శర్మ యాగాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, భువనగిరి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు పైళ్లశేఖర్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్త, అమరవాది లక్ష్మినారాయణ, మిత్తింటి వెంకటేశ్వర్లు, కొండ్లె మల్లిఖార్జున్, కోలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఇరుకుల్ల రామక్రిష్ణ, ప్రణావ సంస్థ చైర్మెన్ బూరుగు రవికుమార్, చెట్ల జనార్ధన్, మల్లగారి శ్రీనివాస్, రాచమల్ల వెంకటేశ్వర్లు, శ్రీహారిహరపుత్ర అయ్యప్పస్వామి దేవాలయ అధ్యక్షులు పస్పునూరి నాగభూషణం, చైర్మెన్ బెలిదె వెంకటేశ్, గోళి పింగల్‌రెడ్డి పాల్గొన్నారు.

సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
నల్లగొండ టౌన్, నవంబర్ 20 : సిపి ఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందారపు లింగస్వామి ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సమావేశం జిల్లా అధ్యక్షులు అలుగుబెల్లి పాపిరెడ్డి అధ్యక్షతన తపస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పూర్తి నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఎన్నికల అదికారిగా బందారపు లింగస్వామి, గుర్రం ప్రభాకర్‌రెడ్డి, పెంటయ్యలు వ్యవహరించగా జిల్లా గౌరవ అధ్యక్షులుగా గార్లపాటి అశోక్‌రెడ్డి, అధ్యక్షులుగా అలుగుబెల్లి పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెంటయ్య, ఉపాధ్యాక్షులుగా వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రేణుక, తుమ్మలపల్లి దామోదర్, రవీందర్‌రావు, కంకనాల రవీంద్రరెడ్డితో పాటు జిల్లా సంయుక్త కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పి ఆర్ సి బకాయిలను విడుదల కోసం ఆరోగ్య కార్డుల సమస్యలను పరిష్కరించేందుకు తపస్ కృషి చేస్తుందని వారు వివరించారు. ఈ సమావేశంలో ఆర్ధిక కార్యాలయ కార్యదర్శి పులిమామిడి దామోదర్‌రెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, జిల్లా మండల, అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.