నల్గొండ

ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 22: నక్కలగండి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తన చాంబర్‌లో దేవరకొండ ఎమ్మెల్యే డి.రవీంద్రకుమార్‌తో కలిసి ఇరిగేషన్, భూసేకరణ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తన వెంట పిఏపల్లి, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులను, నక్కలగండి, డిండి ఎత్తిపోతల నిర్వాసితులను తీసుకవచ్చి వారి సమస్యలను జెసికి విన్నవించారు. జెసి మాట్లాడుతు చట్టవ్యతిరేకంగా కాకుండా న్యాయబద్ధంగా సమస్యలను ఎవరైనా తమ దృష్టికి తీసుకవచ్చి పరిహారం, పునరావాసం పొందాలన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నక్కలగండి తండాలో కూడా భూసేకరణ చేయాలని నిర్ణయించినందునా నిర్వాసితులకు నిబంధనల మేరకు పరిహారం చెల్లించామన్నారు. మిగిలిన వారికి కూడా పరిహార, పునరావాసం కల్పిస్తామన్నారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద భూసేకరణ చేసి పిఏపల్లి, అక్కంపల్లి నిర్వాసితులకు కూడా అపరిష్కృత పరిహార చెల్లింపులకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏకెబిఆర్ 245ఎఫ్‌ఆర్ సర్వేనెంబర్‌లో నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. అలాగే నక్కలగండి ప్రాజెక్టుకు కావాల్సిన భూసేకరణ, ఇప్పటిదాకా చేసిన భూసేకరణ, పరిహారం చెల్లింపు, పెండింగ్ వివరాలను వెంటనే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. పిఏపల్లి మండలం దుగ్యాల గ్రామంలోని ఇరిగేషన్ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
నిర్వాసితులకు ఎంతమందికి, స్థలాలు కేటాయించారన్నదానితో పాటు ఇంకెతమందికి కేటాయించాలన్న వివరాలను నివేదించాలన్నారు. నిర్వాసితులతో జెసి మాట్లాడుతు 129సర్వే నెంబర్‌లో నోటిఫై చేసిన భూమితో పాటు ఇంకా నోటిఫై చేయాల్సివుందన్నారు. ఇప్పటికి గుర్తించిన భూసేకరణలో బత్తాయి తోటలు, బోర్లు, పైప్‌లైన్లకు పరిహారం అందిస్తామన్నారు. కావాల్సిన భూసేకరణ, పరిహారాలపై ప్రతిపాదనలివ్వాలన్నారు. పునరావాసంలో కేటాయించిన ఫ్లాట్లు కబ్జాకు గురైనందునా ఇకమీదట కొత్త వారికి ప్రాధాన్యతనిచ్చి పునరావాసం కల్పించాలన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతు శ్మశాన వాటిక, దేవాలయ నిర్మాణాలు, వౌలిక సదుపాయల కల్పన, మత్స్యకార్మికుల సమస్యలపై పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరగా అందుకు అధికారులు జెసి ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీటీసి స్పందనారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్, శ్రీనివాస్, ఆర్డీవో గంగాధర్, ఎస్‌ఈ సాయిబాబా, డిఈలు నర్సింగరాజు, చక్రపాణి, ఈఈలు కరుణాకర్‌రెడ్డి, సర్వే ఏడి శ్రీనివాస్, తహశీల్ధార్లు గణేష్, యాకుబ్, అర్షద్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.