నల్గొండ

రైతు ఉసురు తగిలితే అంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాపేట, డిసెంబర్ 5: రైతు ఏడ్చిన రాజ్యంలో ఎక్కడైనా ప్రభుత్వాలు కొనసాగిన ధాఖలాలు లేవని డిసిసి అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని బొందుగుల ఎంపిటిసి ఎండి.అసునుద్దిన్ తండ్రి ఎండి.అబీబుద్దిన్ మరణం పట్ల వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల బతుకు బజారుపాలు అయ్యిందన్నారు. రైతులు, వినియోగదారులు పెట్టుబడుల కోసం, వినిమయం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు విరివిగా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. అంతేగాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేందర్‌గౌడ్, నాయకులు సట్టు తిరుమలేష, భాలలక్ష్మి, బాలరాజు, రాంరెడ్డి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
మినీ ఎటిఎంను ప్రారంభించిన కలెక్టర్
భువనగిరి, డిసెంబర్ 5: స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా భువనగిరి శాఖ అద్వర్యంలో వ్యానులో ఏర్పాటుచేసిన మిని ఎటిఎంను యాదాద్రి భువనగిరి జిల్లాకలెక్టర్ అనితారామచంద్రన్ ప్రారంభించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఈకార్యక్రమంలో ఉద్యోగస్తులు మినీ ఎటిఎం ద్వారా 2వేల రూపాయలను డ్రాచేసుకున్నారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రవి, భువనగిరి ఎస్బిఐ మేనేజర్ చంద్రవౌళి, బ్యాంకు సిబ్బంది, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అథ్లెటిక్స్‌లో రాష్ట్ర స్థాయికి
ఎంపికైన చిన్నకాపర్తి విద్యార్థినులు
చిట్యాల, డిసెంబర్ 5: సూర్యాపేటలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నల్లగొండ ఆధ్వర్యంలో జరిగిన అధ్లెటిక్ పోటీల్లో మండలంలోని చిన్నకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు రాష్టస్థ్రాయికి ఎంపికైనట్లుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుకుడాల గోవర్ధన్ తెలిపారు. అధ్లెటిక్స్‌లో అండర్-14 విభాగంలో 9వ తరగతి విద్యార్థిని ఆవుల ధనలక్ష్మి లాంజపంప్, షాట్‌పుట్‌లో, అండర్-12 విభాగంలో 8వ తరగతి విద్యార్థినులు దేశపాక గంగోత్రి లాంగ్‌జంప్, బందెల వెనె్నల షాట్‌పుట్‌లో ప్రతిభను కనబరిచడంతో రాష్టస్థ్రాయికి ఎంపికైనారు. అథ్లెటిక్‌లో రాష్టక్రి తీర్చిదిద్దిన వ్యావాయ ఉపాధ్యాయురాలు బి. సుజాతను రాష్టస్థ్రాయికి ఎంపికైన విద్యార్థినులను సర్పంచ్ వలిగొండ లింగమ్మసోమయ్య, ఎంపిటిసి సభ్యుడు రుద్రారపు భిక్షపతి, ఉపసర్పంచ్ రుద్రారపు శ్రీను, ఎస్‌ఎంసి చైర్మన్ పాలకూరి వెంకటేశం, వైస్‌చైర్‌పర్సన్ మామిళ్ళ భాగ్యశ్రీ, ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్, ఉపాధ్యాయులు కలీమొద్దీన్, ప్రసాద్, శంకర్, రవీంద్రాచారి, వెంకటేశ్వరరావు, శైలజ, అభినందించారు.