నల్గొండ

మాకొద్దు టోకెన్, స్వైపింగ్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 6: రైతుబజార్‌లో నగదురహిత వ్యాపారానికై టోకెన్, స్వైపింగ్ పద్దతిని ప్రవేశ పెట్టవద్దని రైతుబజార్ రైతులు మంగళవారం అన్నారు. స్థానిక రైతుబజార్‌లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టోకెన్, స్వైపింగ్ పద్దతిలో నగదు రహిత వ్యాపారాన్ని కొనసాగించే విధానంపై నల్లగొండ జిల్లా మార్కెటింగ్ అధికారి ఎండి.అలీముద్దీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంలోగా టోకెన్ పద్దతిలో నగదు రహిత వ్యాపారాన్ని రైతు బజార్‌లో ప్రారంభిస్తామని ఆయన అన్నారు. రైతు బజార్‌లో ఐడిఎఫ్‌సి బ్యాంకు సిబ్బంది ఒకరు ఉంటారని, వినియోగదారుడికి కూరగాయల కొనుగోలుకై వంద రూపాయల టోకెన్లు ఇస్తారని ఆయన అన్నారు. టోకెన్లను విక్రయదారుడికి ఇచ్చి కూరగాయలు కొనుక్కోవాలని కోరారు. మిగిలిన టోకెన్లను ఐడిఎఫ్‌సి బ్యాంకు సిబ్బందికి వాపసు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. వ్యాపారం ముగించిన అనంతరం విక్రయదారుడి వద్ద ఉన్న టోకెన్లను బ్యాంకు సిబ్బందికి ఇస్తే ఆయన డబ్బులైన ఇస్తారని, వారి బ్యాంకు ఖాతాలోనైనా జమ చేస్తారని ఆయన అన్నారు. ఇలాంటి విధానాన్ని సిద్దిపేట, హైద్రాబాద్ నగరంలోని అన్ని మార్కెట్‌లలో ప్రారంభించారని ఆయన అన్నారు. మంత్రి హరీష్‌రావు స్వయంగా పర్యవేక్షణ జరిపారని ఆయన అన్నారు. ఇదే విధానాన్ని మిర్యాలగూడలో వారంలోగా ప్రారంభిస్తామని అనగా ఈ పద్దతి పద్దతి మాకొద్దని రైతులు, విక్రయదారులు ముక్తకంఠంతో అన్నారు. సమావేశంలో స్థానిక మార్కెట్ కమిటి సూపర్‌వైజర్లు బి.శ్రీనివాస్, గిరిప్రసాద్, ఇఓ శ్రీనివాస్, రైతులు మున్నయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కనకదుర్గ, హంస్లి ఉన్నారు.
రాఘవపురం కేసులో.. దర్యాప్తు ముమ్మరం

* రాచకొండ అదనపు కమిషనర్ శశిధర్‌రెడ్డి
చౌటుప్పల్, డిసెంబర్ 6: బీబీనగర్ మండలం రాఘవపురం రెవెన్యూ పరిధిలో ప్రవాస భారతీయుడు దీపక్‌కాంత్ వ్యాస్ భూమిని కబ్జా చేసి తప్పుడు రికార్డులు సృష్టించిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతుందని రాచకొండ పోలీస్ అదనపు కమిషనర్ శశిధర్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన అకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను కలియతిరిగి పరిశీలించారు. శాంతిభద్రతలు, రోడ్డుప్రమాదాల నివారణపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిస్థితిపై సిఐ నవీన్‌కుమార్ వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని అదనపు కమిషనర్ శశిధర్‌రెడ్డి సూచించారు. ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాఘవపురం ఘటనపై పోలీసులు అన్ని కోణాల నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన 21 నిందితుల్లో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు.