నల్గొండ

సింగిల్‌విండో ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, డిసెంబర్ 8: కట్టంగూర్ సింగిల్‌విండో ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 13డైరెక్టర్ స్థానాలకు గాను 8డైరెక్టర్ స్థానాల్లో గెలుపొంది సింగిల్‌విండో చైర్మన్‌ను అధిష్టించనుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ గట్టిపోటీ ఇచ్చినప్పటికి 5స్థానాలకే గెలుపు పరిమితమయ్యింది. మొత్తం 13డైరెక్టర్ స్థానాలకు గాను ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా టిఆర్‌ఎస్ సాధించగా 12డైరెక్టర్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపులో అధికారపార్టీ 7స్థానాల్లో ఘన విజయం సాధించింది. కట్టంగూర్ డైరెక్టర్ స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి నిమ్మల సత్యనారాయణ తమ ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి బొడ్డుపల్లి సైదులుపై 49 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. రెండవవార్డు పందెనపల్లి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గద్దపాటి రాములు 5 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. 3వ వార్డు కురుమర్తి స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి కుందారపు వెంకట్‌రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా సైదులుపై 71 ఓట్ల అధిక్యంతో విజేతగా నిలిచారు. 4వ వార్డు చెర్వుఅన్నారం స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి దాసరి శంకర్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి కక్కిరేణి వెంకన్నపై 10 ఓట్లు అధిక్యంతో గెలుపొందారు. 5వ వార్డు అయిటిపాముల స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి కర్నాటి రామన్న 107 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్ధి కొప్పు పురేందర్‌పై 13 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 7వ వార్డు అయిటిపాముల స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి ముసుకు బాలరాజు కాంగ్రెస్ అభ్యర్ధి బెజ పరిశయ్యపై 40 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. 8వ వార్డు బొల్లెపల్లి స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్థి పుట్ట యాదగిరి టిఆర్‌ఎస్ అభ్యర్థి మేడే సాయిలుపై 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 9వ వార్డు పిట్టంపల్లి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కట్ట జానకిరాంరెడ్డి 118 ఓట్లు సాధించి టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఊట్కూరి ఏడుకొండలుపై 28 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. 10వ వార్డు పామనుగుండ్లలో టిఆర్‌ఎస్ అభ్యర్థి రేకల కాంతమ్మ 28 ఓట్ల అధిక్యంతో, 11వ వార్డు పరడలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బద్దం శ్రీను 18 ఓట్ల అధిక్యంతో, 12వ వార్డు పరడలో టిఆర్‌ఎస్ అభ్యర్థి దేవరం సరోజు, 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నకిరేకంటి ఇందిరమ్మ 9 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. కాగా 6వవార్డు అయిటిపాముల స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి నూక సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫలితాల అనంతరం మండలకేంద్రంలో టిఆర్‌ఎస్ నేత్లు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.