నల్గొండ

టెక్స్‌టైల్ పార్క్ రూపురేఖలు మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, డిసెంబర్ 8: టెక్స్‌టైల్ పార్క్ రూపురేఖలు మార్చి అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు తెలిపారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని టెక్స్‌టైల్ పార్క్‌ను గురువారం సాయంత్రం అకస్మికంగా సందర్శించారు. పార్క్‌లోని యూనిట్లను పరిశీలించారు. 119 యూనిట్లకు కేవలం ఐదు యూనిట్లు నడవడం బాధకరమన్నారు. పార్క్‌ల్లో ఇక నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెల్లదని పేర్కొన్నారు. కార్మికుల ఉపాధి కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వచ్చే బడ్జెట్‌లో చేనేతకు నిధులు పెంచుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అందరూ చేనేత వస్త్రాలు ధరించి ప్రోత్సహించాలన్నారు. గోల్కోండ కేంద్రాలను యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. దీనిలో చేనేత జౌళి శాఖ రాష్ట్ర సంచాలకురాలు శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, చేనేత జౌళి శాఖ ఉపసంచాలకుడు రాంగోపాల్‌రావు, జిల్లా చేనేత జౌళి శాఖ ఎడి పద్మ, ఆర్డీవో మహేందర్‌రెడ్డి, తహశీల్దార్ షేక్‌అహ్మద్, సర్పంచ్ దయాకరాచారి, విఆర్వో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంటి పన్నులు చెల్లించి
గ్రామాభివృద్ధికి పాటు పడాలి
నాంపల్లి, డిసెంబర్ 8: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్దికి పాటు పడాలని మండల అభివృద్ది అధికారి హనుమాన్‌ప్రసాద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కార్యాలయం నందు ఇంటి పన్నులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సెక్రెటరీలంతా సర్పంచుల సహకారంతో గ్రామలలో తిరిగి ఇంటింటికి వెళ్లి పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నుల బకాయిలను వసూలు చేయాలన్నారు. ఇంటి పన్ను వసూలు ద్వారా గ్రామ పంచాయితీలన్నీ బలోపేతమవుతాయని, గ్రామాల్లో అభివృద్ది కూడా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.