నల్గొండ

పశువుల తరలింపులో నిబంధనలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 8: పశువులను వాహనంలో తరలించేటప్పుడు నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్ధాయి పశువుల కౄరత్వ నిరోధకస్ధాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పక్షులు, కోళ్లు, జంతువులను తరలించేటప్పుడు కౄరత్వ నిరోదానికి నిర్వాహకులు వ్యక్తులకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు. అందుకు కావల్సిన వస్తువులను, సరఫరా చేసి అందరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సంతల్లో పశువులకు మంచినీటి డబ్బులు, షెడ్డు, ప్రధమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ, జిల్లా పంచాయితీ అధికారులను ఆదేశించారు.

మెరుగైన వైద్యసేవలందించాలి

* వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి వాకటి కరుణ
సూర్యాపేట,డిసెంబర్ 8: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్టను పెంచేలా సిబ్బంది పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి వాకటి కరుణ కోరారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఆమె తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అంతా కలియతిరిగి పరిసరాలను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది వివరాలను, ఖాళీపోస్టులను గురించి చర్చించారు. జిల్లాకేంద్రంగా మారినందున ఆసుపత్రిని జిల్లాకేంద్ర ఆసుపత్రిగా ఉన్నతీకరించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో కాన్పులు ఆశీంచిన మేర జరగడం లేదని, కాన్పులను రెట్టింపు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం అదనంగా ప్రసూతి వైద్యుని పోస్టును కేటాయిస్తామన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు జిల్లాలో పిహెచ్‌సిల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు రెండునెలల్లో కొత్త దుప్పట్లను పంపిణిచేసేందుకు నిధులు మంజూరీచేసినట్లు తెలిపారు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న దుప్పట్లను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సూపరిండెంట్ గది ఎలా ఉందో ఆసుపత్రి అంతా అదే విధంగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో ఓపి సేవలకు వైద్యుల కొరత నెలకొన్న దృశ్య పిపి వైద్యులతో సేవలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో రూ. 90లక్షల నిధులు అందుబాటులో ఉన్నందున వాటిని తక్షణమే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.