నల్గొండ

ఫ్లోరోసిస్ బాధితులకు పోలీస్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 8: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన జనమైత్రి కార్యక్రమంలో భాగంగా ఫ్లోరోసిస్ బాధితులకు కార్పోరేట్ వైద్య చికిత్సలు అందించి ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ముందడుగు వేశారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి సారధ్యంలో మర్రిగూడలో ఫ్లోరోసిస్ బాధితులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఎంపిక చేసిన ఫ్లోరోసిస్ రోగులు 12మందికి హైద్రాబాద్ కేర్ ఆసుపత్రిలో కార్పోరేట్ వైద్యం చేయించారు. ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఇటీవల దేవరకొండలో ‘అమ్మా నన్ను అమ్మకే’ పేరుతో ఆడపిల్లల రక్షణకు, లింగవివక్షత నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి జనంలోకి వెళ్లేందుకు ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించడం గమనార్హం.

జనాభా దామాషా కింద బిసిలకు రిజర్వేషన్లు
* రాష్ట్ర ప్రభుత్వం బిసి సంక్షేమ అభివృద్ధికి పాటు పడాలి
* బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
నల్లగొండ టౌన్, డిసెంబర్ 8: దేశవ్యాప్తంగా 52శాతం ఉన్న బిసిలకు చట్టసభల్లో జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులతో కలసి మాట్లాడుతూ శాసన సభ సమావేశం తొలిరోజే బిసిల చట్టబద్దతకు అనుకూలమన్న సి ఎం కేసి ఆర్ 70 సార్లు ఢిల్లీకి వెళ్లినా దాని గురించి బిసిలకు స్పష్టత, భరోసా కల్పించలేదని విమర్శించారు. ఇట్టి విషయంపై ప్రజా ప్రతినిధులు, ఎంపీలు సైతం నోరు మెదపకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. గతంలో ఉమ్మడి పాలనలో ఏపి సి ఎం చంద్రబాబు సైతం 90 సార్లు ఢిల్లీకి వెళ్లినా సాధించలేదని, అదేబాటలో సి ఎం కేసి ఆర్ పయనించడం బిసిలను విస్మయానికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు బిసిలను ఆనాటి నుండి ఓటు బ్యాంకులాగే చూస్తున్నారని, రాను రాను ఇలాగే ప్రవర్తిస్తే బిసిల ఆత్మగౌరవ పోరాటం ఎదురుకోకతప్పదని హెచ్చరించారు. బిసి కమీషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే మానిఫెస్టో ప్రకారం ప్రతి సంవత్సరం బిసిల సంక్షేమానికి బడ్జెట్‌లో 5వేల కోట్లు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం రెండున్నర సంవత్సరాలుగా తుంగలో తొక్కడం శోఛనీయమన్నారు. రానున్న రోజుల్లో 31 జిల్లాలో ఏర్పాటు చేయబోయే బిసిల చైతన్యరధయాత్రకు ప్రజల పూర్తి మద్దతను ఆశిస్తున్నామని, అట్టి రధయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బిసిల సమస్యలను కమీషన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈసమావేశంలో జిల్లా సంక్షేమ సంఘం నాయకులు కంది సూర్యనారాయణ, కాసోజు విశ్వనాధం, దుడుకు లక్ష్మినారాయణ, గండిచెర్వు వెంకన్నగౌడ్, భూపేందర్, జనార్ధన్‌గౌడ్, శంకర్, చిలకరాజు సతీష్, సాయిబాబా పాల్గొన్నారు.